నక్కతోక తొక్కిన టిక్ టాక్ స్టార్ దుర్గారావు.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ?

- Advertisement -

మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం మరో సీజన్ కు రెడీ అయింది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదలై వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ కి కూడా మన్మథుడు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గత సీజన్లకంటే కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది. కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేది వీళ్లే అంటూ పలువురి పేర్లు వైరల్ అవుతున్నాయి. కొత్త సీజన్ సరికొత్త రూల్స్, గేమ్స్ తో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి హౌస్ లోకి వచ్చేందుకు చాలా మందిని సంప్రదించగా కొందరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య కూడా వస్తుందంటూ టాక్ వచ్చింది. కానీ బేబీ మూవీ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది వైష్ణవి.

tik tok durga rao
tik tok durga rao

ఇలా ఉండగా బిగ్ బాస్ లోకి మరో పాపులర్ టిక్ టాక్ స్టార్ ఎంట్రీ ఇస్తారనే వార్త వినిపిస్తోంది. అతను మరెవరో కాదు దుర్గారావు. తన గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తన భార్యతో కలిసి టిక్ టాక్ లో చేసిన డ్యాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. టీవిలో కనిపించడమే కాకుండా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో తళుక్కుమన్నారు. ఆ తరువాత ఇప్పుడు దుర్గారావు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గత సీజన్లోనే ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా అది జరగలేదు. అయితే ఇప్పుడు ఎంట్రీ గ్యారంటీ అని సమాచారం. తాజాగా దుర్గారావు ఆ విషయం పై క్లారిటీ ఇచ్చారు. తనకు బిగ్ బాస్ మేనేజ్ మెంట్ నుంచి ఫోన్ వచ్చిందని కానీ తనను ఒక్కడినే రమ్మన్నారని చెప్పాడు. కానీ దానికి ఒప్పుకోలేదని తన భార్యకు కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మరి దీనికి బిగ్ బాస్ ఏం ఏమంటారో చూడాలి మరి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here