Tiger Nageshwarao : ధమాకా, వాల్తేరు వీరయ్య , రావణాసుర వంటి చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు మాస్ మహారాజ్ రవితేజ. తాజాగా దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పలుకరించారు. ఈ సినిమా 1980లో గజదొంగగా పాపులర్ అయిన సువర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. ఈసినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్స్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అలాగే అలనాటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
అక్టోబర్ 21న దసరా కానుకగా థియేటర్లో విడుదలైన టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్నే అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకుంది. ఎవరూ ఊహించని విధంగా అప్పుడే ఓటీటీలో డిజిటల్ స్ట్రిమ్మింగ్ అవుతోంది. దీంతో రవితేజ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో అర్ధరాత్రి నుంచి టైగర్ నాగేశ్వరరావు సినిమా అందుబాటులోకి వచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 27న ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుందని వార్తలు వినిపించాయి.. కానీ అనుకున్న సమయానికన్నా ముందే ఈ సినిమా విడుదల అయింది. ఈ చిత్రాన్ని నిర్మాత అభిషేక అగర్వాల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రవితేజ తన మార్కుని ఈ సినిమాతో చూపించారు.