Tiger Nageshwar Rao : మాస్ మహారాజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఎందుకో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.
యూత్ ఆడియన్స్ మొత్తం ప్రస్తుతం ‘లియో’ మూవీ మేనియా లో మునిగి తేలుతుండడమే అందుకు కారణం అని, దాని ప్రభావం లో ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ టాక్ జనాల్లో బలంగా వెళ్లలేదని అంటున్నారు విశ్లేషకులు. హిందీ లో ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం రవితేజ ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు. కానీ అక్కడ కనీస స్థాయిలో కూడా వసూళ్లు రాలేదట. మరి ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను మొదటి రోజు రాబట్టిందో ఒకసారి చూద్దాం.
బుక్ మై షో టికెట్ సేల్స్ యాప్ ఆధారంగా ఈ సినిమాకి మొదటి రోజు 92 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది యావరేజి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ‘భగవంత్ కేసరి’ చిత్రానికి మొదటి రోజు లక్ష 53 వేల టిక్కెట్లు ఈ యాప్ నుండి అమ్ముడుపోయాయి. ఆ సినిమా ఓపెనింగ్ దాదాపుగా 12 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. ‘టైగర్ నాగేశ్వర రావు‘ అందులో సగం, అంటే ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది యావరేజ్ ఓపెనింగ్ అయ్యినప్పటికీ బ్రేక్ ఈవెన్ కి ఏమాత్రం సరిపోదు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 37 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే వీకెండ్ లోపు ఈ సినిమా కచ్చితంగా పాతిక కోట్ల రూపాయలకు పైగా వసూలు చెయ్యాలి. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. దసరా రోజు ఏదైనా మ్యాజిక్ నంబర్స్ ని పెడుతుందేమో చూడాలి.