Bigg Boss Shivaji కొడుకు చిన్న పిల్లాడు..పెద్దవాడు ఈమధ్యనే పై చదువుల కోసం అమెరికా కి వెళ్ళాడు. మరి చిన్నకొడుకు కి ప్రాణహాని వచ్చేంత పరిస్థితి ఏమొచ్చింది అని అనుకుంటూ ఉన్నారా?, శివాజీ కొడుకు అంటే రియల్ లైఫ్ లో ఉన్న కొడుకు కాదు, రీల్ లైఫ్ లో కొడుకు. రీసెంట్ గా శివాజీ ’90s : ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్ చేసాడు.

ఈ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతూ అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో శివాజీ కొడుకులుగా రోహన్ , మౌళి నటించగా, కూతురు గా వాసంతిక నటించింది. ఇదంతా పక్కన పెడితే శివాజీ పెద్ద కొడుకుగా నటించిన మౌళి ఈ వెబ్ సిరీస్ కి ముందే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఇతని వీడియోస్ కి సంబంధించిన మీమ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి.

అంతే కాకుండా ఇతను ఒక స్టాండప్ కమెడియన్ కూడా. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న మౌళి ఫన్నీ జోక్స్ చెప్తూ ‘ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేస్తాను చూడండి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ని మాయం చేశాను, వెళ్లి చూసుకోండి ఎక్కడా దొరకదు’ అని అంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో ని చూసిన వెంటనే వైసీపీ పార్టీ నాయకులకు, అభిమానులకు చాలా తీవ్రమైన కోపం వచ్చింది.

ఏంటి నీకు అంత దూలగా ఉందా, జగన్ గారి ప్రభుత్వం మీదనే సెటైర్లు వేస్తావా, నీ ఇంటి అడ్రస్ చెప్పు, చంపేస్తాం నిన్ను అంటూ సోషల్ మీడియా లో బెదిరించారు. దీనిపై మౌళి స్పందిస్తూ ‘నేను ఎవరినీ ఉద్దేశించి కావాలని కామెడీ చెయ్యలేదు. నలుగురికి నవ్వు రప్పించడం కోసమే ఆ అంశం ని వాడుకున్నాను. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. నా తల్లితండ్రులను ఇందులోకి లాగి తిట్టొద్దు’ అంటూ మౌళి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసాడు.