Bigg Boss Telugu 7 : ఇప్పటి వరకు ప్రసారమైన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ప్రత్యేకంగా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ వారం ఎదో ఒక సరికొత్త టాస్కుతో ఒక పక్క కంటెస్టెంట్స్ ని మరోపక్క ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు బిగ్ బాస్. గత ఆదివారం నాడు 5 మంది కొత్త కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.

వీళ్ళను ‘పోటుగాళ్ళు’ అని, అలాగే పాత కంటెస్టెంట్స్ ని ఆటగాళ్లు అని రెండు గ్రూప్స్ గా డివైడ్ చేసాడు బిగ్ బాస్. ‘పోటుగాళ్ళు’ టీం లోకి సీక్రెట్ రూమ్ నుండి బయటకి వచ్చిన గౌతమ్ ఎంటర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అతనికి ఒకరిని సేవ్ చేసే పవర్ బిగ్ బాస్ ఇవ్వగా , ఆయన సందీప్ ని నామినేషన్స్ నుండి సేవ్ చేస్తాడు.

ఇక ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అమర్ దీప్, శోభా శెట్టి, అశ్వినీ, నాయని పావని, తేజా, పూజా మూర్తి మరియు యావర్. వీరిలో అందరికంటే అత్యధిక ఓట్లతో యావర్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతి స్థానం లో అమర్ దీప్ ఉన్నాడు. అయితే చివరి రెండు స్థానాల్లో మాత్రం పూజా మూర్తి మరియు శోభా శెట్టి ఉన్నారు. వీళ్ళిద్దరిలో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే తన ముందున్న పూజా మూర్తి కి మరియు శోభా శెట్టి కి ఓట్ల తేడా చాలా ఉంది. ఇక ఈ వారం ఆమె కాస్త పొగరుగా వ్యవహరించడం ఆడియన్స్ కి నచ్చలేదు. దానికి తోడు ప్రియాంక తో చేరి గ్రూప్ గా ఆటలు ఆడుతుంది అంటూ ఆమెపై సోషల్ మీడియాలో బోలెడంత నెగటివిటీ ఉంది. అందుకే ఆమెకి అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. ఇక వచ్చే వారం ప్రియాంక నామినేషన్స్ లోకి వస్తే ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.