Guntur Kaaram : ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ కు పరిచయమై ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా అభిమానుల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో అభిమానుల్లో కాస్త అసహనం కనిపిస్తోంది. అసలు ఇది మహేష్ బాబు స్థాయి సినిమా కానే కాదన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా సినిమాలో మహేష్ బాబు నటన.. శ్రీ లీల డ్యాన్స్ తప్పితే సినిమాలో మరేం లేదని టాక్ బాగా వైరల్ అవుతోంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ దళితులను తన సినిమాలో కించపరిచాడంటూ కొందరు జనాలు మండిపడుతున్నారు. దళితులను కించపరిచే విధంగా సినిమాలో ఉన్న కొన్ని డైలాగ్స్ తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు . “నువ్వు క్రిస్టియన్ వి ఏంటారా..?” అనే డైలాగ్ ను తీసేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు .

అంతేకాదు కావాలనే కొందరికి దళితులను కించపరిచే విధంగా పేర్లను పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా హర్టింగా ఉన్నాయ. వాటిని వెంటనే డిలీట్ చేయాలి లేందంటే ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి సందడి చేసింది.