ఎంతటి కఠినాత్ముడైనా ప్రతి ఒక్కరిలో ఎక్కడో ఓ చోట మంచితనం ఉంటుంది. అతి మంచితనం కూడా మంచిది కాదు. కొన్ని సార్లు అదే మన పాలిట శాపంగా కూడా మారవచ్చు. అందుకే మంచి తనానికి కూడా పరిధి ఉండాలంటారు. అతి లిమిట్స్లో ఉన్నప్పుడే మంచితనానికి మంచిపేరు వస్తుంది. దానికి సరైన ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని జనాలే స్పష్టం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎన్ని విమర్శలు వచ్చినా కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు చిరంజీవి.. అందుకే ఆయనకు ఆకాశమంత ఫ్యాన్ ఫాలోయింగ్.
స్వయంకృషితో ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా మెగా స్టార్ గా ఎదిగారు. తాను ఎదిగే క్రమంలోనే ఎంతో మందిని స్టార్లను చేశారు. తెరపైనే కాకుండా బయట కూడా ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సంఘటనలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ.. కొందరు కావాలని ఆ వార్తలకు మరింత ప్రచారం చేస్తున్నారు. తన స్థాయికి చిరంజీవి తలుచుకుంటే ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ల పని చిటికెలో చెప్పేయవచ్చు.
కానీ అలాంటి పని చేయడం లేదు. లీగల్ గా వెళ్లుంటే వారు మరోసారి చిరంజీవి పేరు ఉచ్చరించడానికే బయపడేట్లు చేయొచ్చు.. కానీ ఆయన మంచితనం కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అందుకే మెగా అభిమానులు సైతం ఆయన పై కొన్ని సార్లు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇంత మంచితనం పనికి రాదు అంటూ కోపగించుకుంటున్నారు. మెగా కోడలిపై, తన చిన్న కూతురు శ్రీజ పై ఎలాంటి దారుణమైన కామెంట్స్ చేశారో అందరికీ తెలిసిందే. వాళ్ళ పాపన వాళ్లే పోతారని చిరు సైలంట్ గా ఉండడం బాగాలేదని.. ఆయన మంచి తనం బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పుకుంటున్నారు.