Pawan Kalyan : పవన్ కల్యాణ్ హీరోయిన్ అనర్గళంగా ఆరు భాషల్లో మాట్లాడగలదు.. ఆమె ఎవరో తెలుసా ?

- Advertisement -


Pawan Kalyan : టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ట్రెండ్ ఫాలో కాకుండా కొత్త ట్రెండ్ సృష్టించిన వన్ అండ్ ఓన్లీ హీరో పవన్. అలాంటి ఆయనతో నటించాలని చాలామంది హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దొరికితే తనలోని ఉన్న సత్తాను నిరూపించుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ సరసన హిట్ సినిమాలో నటించిన ఓ టాలెంటెడ్‌ హీరోయిన్ ఏకంగా 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు. ఆమె ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసిన నటించిందో తెలుసా.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు జనరేషన్లకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన రోజు రోజుకు యూత్ లో తన క్రేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ ఫ్యాన్స్ లో తన సినిమాలపై ఆసక్తి కల్పిస్తూనే ఉన్నాడు. అలాగే తన సినిమాలో నటించేందుకు యంగ్ హీరోయిన్లకు కూడా అవకాశాలిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలతో.. అటు రాజకీయాలతో బిజి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అస‌లు మేటర్లోకి వస్తే.. పవన్ కళ్యాణ్ తాను నటించడం భీమ్లా నాయక్ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యం మీనన్ నటించిన సంగతి తెలిసిందే.

ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఫ్యాన్స్, ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిత్యమీనన్ ఏకంగా ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుందట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ లో అవలీలగా మాట్లాడగలదు. ఈ భాషల్లో నటించే సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటదట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వామ్మో నిత్యామీనన్ ఏకంగా ఇన్ని భాషలు మాట్లాడుతుందా.. డబ్బింగ్ కూడా తానే చెప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు ఆమె స్వయానా సింగర్ కూడా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here