నటీనటులు : రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, రఘు బాబు, పృథ్వి, రాజా రవీంద్ర, బిత్తిరి సతి తదితరులు.
రచన- దర్శకత్వం : వీరభద్రం చౌదరి
Thiragabadara Saami Movie Review ప్రస్తుతం మీడియా లో రాజ్ తరుణ్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు ఈమధ్య మీడియా లో అతని గురించే చర్చ నడుస్తుంది. గూగుల్ ట్రెండ్స్ లో గత రెండు నెలల నుండి ఆయన స్టార్ హీరో రేంజ్ ట్రెండ్ అవుతున్నాడు. రాజ్ తరుణ్ కెరీర్ లో చాలా హిట్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడూ లేనంతగా అతను ఇంతలా ట్రెండ్ అవ్వడానికి కారణం అతని మాజీ ప్రేయసి లావణ్యనే. నాకు రాజ్ తరుణ్ కావాలి అంటూ ఆమె చేస్తున్న రచ్చ రోజు రోజుకి ఎక్కడికో పోతుంది. ఇలా రాజ్ తరుణ్ కాంట్రవర్సీలతో బాగా ట్రెండ్ అవ్వడంతో దానిని క్యాష్ చేసుకునేందుకు అతని సినిమాల దర్శక నిర్మాతలు రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ చిత్రాలను విడుదల చెయ్యడానికి సిద్ధం ఐపోతున్నారు. వారం రోజుల క్రితమే ఆయన హీరోగా నటించిన పురుషోత్తముడు చిత్రం విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇక నేడు ఆయన హీరోగా నటించిన తిరగబడరా సామీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూసి తెలుసుకోబోతున్నాము.
కథ :
సమాజం లో తప్పిపోతున్న ఆడవాళ్లను కనిపెట్టి వెనక్కి తీసుకొని వచ్చి వారి కుటుంబాల దగ్గరకు చేర్చడం గిరి(రాజ్ తరుణ్) తన వృత్తిగా పెట్టుకున్నాడు. దీని వల్ల ఆయనకీ ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఎదో ఒకరోజు అతని ప్రాణాలకే ముప్పు ఉండే పరిస్థితి ఉండడం తో ఇతనికి పిల్లని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. అలాంటి సమయం లో గిరి ని పెళ్లి చేసుకునేందుకు ఒక అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా) ముందుకు వస్తుంది. పెళ్ళైన కొద్దిరోజులకే ఆమె గర్భం కూడా దాలుస్తుంది. అయితే శైలజ అనాధ కాదని ఒకరోజు గిరికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత గిరి ఏమి చేసాడు..?, అసలు శైలజ ఉద్దేశపూర్వకంగా గిరి జీవితంలోకి ఎందుకు వచ్చింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. గతం లో ఈయన యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసాడు. అలాంటి సినిమాలు తీసిన ఆయనేనా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది? అనే అనుభూతి ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. అంతటి వీక్ టేకింగ్, స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని నడిపించాడు. సినిమా మొత్తం మీద ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేందుకు ఏమి చెయ్యలేదు డైరెక్టర్. ఒక సన్నివేశం తర్వాత మరో సన్నివేశం ఏమి జరగబోతుందో చిన్న పిల్లవాడు కూడా చెప్పగలడు. అలాంటి స్క్రీన్ ప్లే నడిపించాడు డైరెక్టర్. కనీసం పాటలైనా బాగుంటాయా అంటే అది కూడా లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డల్ గా ఉంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, రాజ్ తరుణ్ మంచి ఎనర్జీ ఉన్న హీరో, కామెడీ టైమింగ్ కూడా ఉన్నటువంటి అతి తక్కువమంది హీరోలలో ఆయన ఒకడు. అలాంటి రాజ్ తరుణ్ ని డైరెక్టర్ సరిగా వాడుకోలేదని ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. ఇక మన్నారా చోప్రా వీరభద్రం చౌదరి కి ప్రత్యేకమైన ఇష్టంతో, కేవలం గ్లామర్ షో కోసం పెట్టుకున్నట్టు ఉంది. అలాగే ఈ చిత్రం తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా మాల్వీ మల్హోత్రా అటు అందం పరంగాను, నటన పరంగాను పర్వాలేదు అనిపించింది. సరైన స్క్రిప్ట్స్ ఎంచుకొని ముందుకు వెళ్తే మాత్రం ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని అనుకోవచ్చు.
విశ్లేషణ :
థియేటర్స్ లో చూడదగిన సినిమా కాదు. ఓటీటీ లో వచ్చినప్పుడు చూడండి.
రేటింగ్ : 2 /5