Nani : ఆ సినిమా నుంచి తప్పుకో.. నీకు రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్.. నాని ఏం చేశాడంటే?

- Advertisement -


Nani : హీరో నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి న్యాచురల్ స్టార్ అనిపించుకున్నారు. వరుస విజయాలతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు నాచురల్ స్టార్ నాని. డిఫరెంట్ కథనలను ఎంచుకుంటూ మీడియం రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. నాని సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే నాని ఎంచుకున్న సినిమా కథపై ఓ టాలీవుడ్ హీరో కన్నేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని నుంచి తప్పుకునేందుకు ఆయనకు రూ.50 కోట్లు ఆఫర్ చేశాడట.

Nani
Nani

ఆ సినిమా ఏది అనే విషయానికి వస్తే నాని డ్యూయల్ రోల్ పోషించిన శ్యామ్‌సింగరాయ్. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ మంచి టాక్ తెచ్చుకుని విజయం సాధించింది. కాగా నాని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో హీరో నానికి ఫోన్ చేశాడు. ఈ మూవీ నుంచి తప్పుకోవాలని అడిగాడట. ఆ సినిమా నుండి నువ్వు తప్పుకుంటే తాను ఇందులో హీరోగా చేస్తానని.. నువ్వు తీసుకునే రెమ్యునరేషన్ డబుల్ ఇస్తానంటూ ఆఫర్ చేశాడట. అప్పటికి నానికి రూ.25కోట్లని టాక్.. అంటే దాదాపు ఆ హీరో ఇస్తానన్నది రూ.50 కోట్లు.

అయినా నాని మాత్రం తను ఒప్పుకున్న సినిమా నుంచి తప్పుకోవడం కుదరదు తేల్చి చెప్పాడట. నాని అనుకున్నట్టుగానే ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఉంటే నాని దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలోని గాజు బొమ్మ ఆడియో సాంగ్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here