Payal Rajput : యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RX 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ భామ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో కుర్రాళ్లలో మంచి పాపులారిటీ సంపాదించి ఇండస్ట్రీలో గట్టి పునాదిని ఏర్పాటు చేసుకుంది. రీసెంట్ గా మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రక్షణ’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ తాజాగా చేసిన పోస్ట్ అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొందరు తనను భయపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘రక్షణ సినిమా ఉంది. అది 2019-2020 మధ్యలో షూట్ చేశాం. దాని ఒరిజినల్ టైటిల్ 5ws. విడుదల కొంచెం లేట్ అయింది. అయితే ఇప్పుడు వాళ్లు నాకున్న పాపులారిటీని రీసెంట్‌గా వచ్చిన సక్సెస్‌ను చూసి ఈ సినిమాను కూడా రిలీజ్ చేసి బెనిఫిట్ పొందాలని భావిస్తున్నారు. వారు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రమోషన్లకు రావాలని అడుగుతున్నారు. నా బృందం వారితో మాట్లాడింది. అయితే నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. నా టీం రక్షణ సినిమా డిజిటల్ ప్రమోషన్స్‌కు వస్తామని వాళ్లకి చెప్పారు. నాకు రావాల్సిన బకాయిలను కూడా క్లియర్ చేయాలని సూచించారు. అయితే, వారు రాజీకి నిరాకరిస్తున్నారు. నా పేరు డ్యామేజ్ చేసే రీతిలో వాడుతున్నారు. ఇటీవలి సమావేశాల్లో పరుష పదజాలం ఉపయోగించారు.
పాయల్ కొన్ని ఆస్తులు అడిగిందని, లేదంటే సినిమా విడుదలకు ఒప్పుకోనని నా పేరు వాడుకుంటున్నారు. నాకు చెల్లించాల్సిన పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించకుండా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా.. నా అనుమతి లేకుండానే రక్షణ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పాయల్ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు మిమ్మల్ని ఎవడు బ్యాన్ చేస్తామంటూ బెదిరించేది.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.
View this post on Instagram