Rajeev Kanakala : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎప్పటికీ టాప్ యాంకర్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం సుమ. ఆమెకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు మళయాళీ అయినా తెలుగుపై పట్టు సాధించి అనర్గళంగా మాట్లాడగలదు. ఎలాంటి షోస్ నైనా సరే తన మాటల గారడీతో అవలీలగా హోస్ట్ చేయగలరు. రీసెంట్ గా ఆమె కొడుకు రోషన్ కనకాల కూడా సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ప్రజెంట్ పలు షోలతో బిజీగా ముందుకు వెళ్తున్న యాంకర్ సుమ.. యూట్యూబ్ ఛానల్స్ లో తన హవా కొనసాగిస్తోంది.

కాగా, రీసెంట్ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. సుమకి షోలు తగ్గడం పై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాజీవ్ మాట్లాడుతూ.. “సుమ కెరియర్ స్టార్టింగ్ నుంచి బాగా కష్టపడుతుంది. తాను నమ్మిన వర్క్ పట్ల చాలా డెడికేషన్ గా ఉంటుంది. బాగా సంపాదిస్తుందని.. అయినా, ఎప్పుడూ కూడా పిల్లల్ని చూసుకోకుండా లేదు.. ఒక పక్క కెరియర్ మరొకపక్క పిల్లలను చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా షోస్ లేట్ అవుతున్నాయి.. అని తెలిస్తే పిల్లలను తన వెంట తీసుకెళ్లి పోతుంది.’’

“చాలా బాగా మేనేజ్ చేస్తుంది. ఒకప్పుడు సుమకి చాలా ఎక్కువ షోస్ ఉండేటివి.. ఇప్పుడు సుమకి షోస్ తగ్గిపోయాయి.. అయితే ఆ షోస్ తగ్గడానికి కారణం పిల్లలే.. వాళ్లతో టైం స్పెండ్ చేయడానికి తగ్గించుకుంది.. యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్లతో టైం స్పెండ్ చేస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. రాజీవ్ కనకాల ఫ్యామిలీ విషయాలను ఇలా ఓపెన్ గా చెప్పడం పట్ల ఆయన సిన్సియారిటీ డెడికేషన్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.