ఎంత వయస్సు వచ్చినా తరగని అందం ఉన్న హీరోలు ఉంటారు .. హీరోయిన్లు ఉంటారు, వీళ్ళ అందాన్ని చూస్తే కుర్రవాళ్ళు కూడా అసూయ పడక తప్పదు. అలాంటి అందాన్ని సొంతం చేసుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు. కాంతివంతమైన స్కిన్ టోన్ తో, చూపులు తిప్పుకోలేని అందం తో కుర్రాళ్లకు అసూయ కలిగేలా చేస్తున్నాడు. అసలు ఆయనకీ 48 ఏళ్ళ వయస్సు అంటే ఎవరైనా నమ్ముతారా?, ఆయన కొడుకు గౌతమ్ బాబు పక్కన నిలబడితే అన్నదమ్ములు లెక్క అనిపిస్తారు.
మహేష్ బాబు ఇంత వయస్సు లో కూడా ఇలా అందంగా ఉండడానికి కారణం ఆయన ఫిట్నెస్ అని సూపర్ స్టార్ కృష్ణ సైతం అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూనే ఉంటాడట. కనిపించిన ప్రతీ ఫుడ్ తినకుండా డైట్ కంట్రోల్ తూచా తప్పకుండా ఫాలో అవుతాడట. అందుకే ఇంత వయస్సులో కూడా అందంగా ఉంటాడు అని చెప్పుకొస్తాడు.
ఇక పోతే రీసెంట్ గా మహేష్ బాబు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి అప్లోడ్ చేసాడు. ఇందులో ఆయన ట్రెడ్ మిల్ పై వేగంగా పరిగిస్తూ, పుషప్స్ చేస్తూ ,జిమ్ లో ఎలాంటి వర్కౌట్స్ చేస్తామో, అలాంటి వర్కౌట్స్ మొత్తాన్ని షూట్ చేయించి అప్లోడ్ చేసాడు. అందులో ఏముంది, అందరూ చేసేదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన వయస్సు చిన్నది ఏమి కాదు, 48 సంవత్సరాలు నిండాయి.
ఈ వయస్సు లో కూడా ఆ డెడికేషన్ ని చూసి యంగ్ జెనెరేషన్ హీరోలు చాలా నేర్చుకోవాలి. ఇకపోతే మహేష్ బాబు ఇంత కష్టపడుతున్నది, సిక్స్ ప్యాక్ కోసమేనట. త్వరలోనే ఆయన రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటి నుండి కసరత్తులు మొదలు పెట్టాడు మహేష్ బాబు. ఇప్పటి వరకు చొక్కా విప్పి బాడీ ని ఎక్సపోజ్ చెయ్యని మహేష్ బాబు, ఈ చిత్రం లో సిక్స్ ప్యాక్ లో కనపడితే అభిమానులు ఏ రేంజ్ లో మెంటలెక్కిపోతారో ఊహించుకోవచ్చు.