ఈ దీపావళికి థియేటర్/ఓటీటీల్లో దద్దరిల్లే సినిమాలు ఇవే

- Advertisement -

దసరా పండగకు భగవంత్ కేసరి వంటి సినిమాలు బాక్సాఫీస్‌ ధూంధాం చేశాయి. ఇక దీపావళి వచ్చేస్తోంది. ఈ దీపావళికి థియేటర్లలో దద్దరిల్లేందుకు పలు సినిమాలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ దీపావళికి హంగామా అంతా డబ్బింగ్ సినిమాలదే. కార్తీ జపాన్ నుంచి రాఘవ లారెన్స్ జిగర్ తాండా డబుల్ ఎక్సెల్ వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేందుకు డబ్బింగ్ సినిమాలు సిద్ధం అవుతున్నాయి. వద్ద పలు పెద్ద  చిత్రాలు థియేటర్‌లో సందడి చేయగా, ఆ హంగామా దీపావళికి కూడా కొనసాగుతోంది. అలాగే ఓటీటీలోనూ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్లు సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..?

ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే..తమిళ్ హీరో కార్తీ.. తెలుగులోనూ అందరికి సుపరిచతమే. తన తొలి సినిమా ఆవారా నుంచి ఊపిరి, ఖైదీ వంటి సినిమాలతో కార్తీ టాలీవుడ్లో తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. ఇక అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ.. తానూ తెలుగువాడేనని అనిపించేలా ప్రేక్షకులతో మమేకవ్వడం కార్తీ స్పెషాలిటీ. అందుకే ఈ హీరోకు టాలీవుడ్లో ఫ్యాన్స్ ఎక్కువే. అందువల్లే కార్తి ప్రతి సినిమా తెలుగులో డబ్ చేస్తూ ఉంటారు నిర్మాతలు. తాజాగా కార్తీ హీరోగా.. రాజు మురుగన్‌ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా ‘జపాన్‌’ . అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కార్తి ‘జపాన్‌’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

JigarTanda

రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య.. ఈ ఇద్దరు మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు. ఒకరు డ్యాన్స్ ఇరగదీస్తూ.. డైరెక్షన్లో దుమ్ము దులిపేస్తూ యాక్టింగ్లోనూ సత్తా చాటుతోంటే.. మరొకరు ఓవైపు డైరెక్షన్.. ఇంకోవైపు యాక్టింగ్తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కీలక పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ రూపొందిస్తున్న చిత్రం ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ . దీపావళి కానుకగా ఈ మూవీ కూడా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

బాలీవుడ్‌ స్టార్ హీరో టైగర్ ఫ్రాంచైజీలో వస్తున్న మరో సినిమా టైగర్-3. మనీష్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్లో కత్రినా కైఫ్‌ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు.. కత్రినా చేసిన బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ థియేటర్లో కచ్చితంగా ఈలలు కొట్టించేలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. దీపావళి సందర్భంగా నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

దినేశ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ కథానాయికలు. ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా రానున్న ‘ది మార్వెల్స్‌’ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది. 

ఓ అందమైన పల్లెటూరి కథ ‘దీపావళి’. నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

అమెజాన్‌ ప్రైమ్‌

రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌) నవంబరు 7

బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) నవంబరు 9

పిప్పా (హిందీ) నవంబరు 10

నెట్‌ఫ్లిక్స్‌

ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6

ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8

రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8

ది కిల్లర్‌ (హాలీవుడ్‌) నవంబరు 10

ఆహాది రోడ్‌ (తమిళం) నవంబరు 10

డిస్నీ+హాట్‌స్టార్‌ది శాంటాక్లాజ్స్‌(వెబ్‌సిరీస్‌2) నవంబరు 8

విజిలాంటి (కొరియన్‌) నవంబరు 8

లేబుల్‌ (తెలుగు) నవంబరు 10

జీ5ఘూమర్‌ (హిందీ) నవంబరు 10

బుక్‌ మై షోది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌)నవంబరు 7

యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 7

ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 10

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here