Manchu Lakshmi : ఉపాసన కి తెలియకుండా రామ్ చరణ్ ఇంట్లో ఎన్నో నెలలు రహస్యంగా ఉండేదాన్ని : మంచు లక్ష్మి

- Advertisement -

Manchu Lakshmi : మెగా ఫ్యామిలీ మరియు మంచు కుటుంబం లో చిరంజీవి, మోహన్ బాబు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనే విషయం కాసేపు పక్కన పెడితే, ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన ఈ తరం నటులు మాత్రం ఎంతో అన్యోయంగా ఉంటున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మి, రామ్ చరణ్ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. రీసెంట్ గా మంచు లక్ష్మి యాక్ష్మిని అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించింది. ఈ వెబ్ సిరీస్ తో పాటు పలు సినిమాల్లో కూడ ఆమె నటిస్తూ బిజీ గా గడుపుతుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ తో తనకి ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చింది.

Ram Charan, Lakshmi and Manoj Manchu celebrate Diwali with a cake. Viral pic - India Today

ఆమె మాట్లాడుతూ తానూ హైదరాబాద్ నుండి ముంబై కి మకాం మార్చినప్పుడు ముంబై తనకి ఇల్లు కూడా ఉండేది కాదని, ఆ సమయం లో రామ్ చరణ్ కి ముంబై లో ఉండే ఫ్లాట్ లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. రామ్ చరణ్ కూడా ఎవరికీ చెప్పొద్దూ అన్నాడు. ఉపాసన కి కూడా ఈ విషయం తెలియదు అంటూ లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ మేమంతా చిన్నప్పటి నుండి ఎంతో మంచి స్నేహితులం అని, రామ్ చరణ్ , నేను , మనోజ్ ఇలా మేమంతా ఒక వాట్స్ యాప్ గ్రూప్ లో ఉండేవాళ్ళం అని, మా సినిమాలకు సంబంధించి ఏ వార్త వచ్చిన ఆ గ్రూప్ లో షేర్ చేసుకునేవాళ్లం అని ఈ సందర్భంగా మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

- Advertisement -

Manchu Lakshmi : అప్పుడు రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను.. మా అందరికి కలిపి వాట్సాప్ గ్రూప్ ఉంది.. మంచు లక్ష్మి వ్యాఖ్యలు.. | Manchu lakhsmi interesting comments on ram charan ...

ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మెగా కుటుంబం లో ఏ పండుగ జరిగినా మంచు లక్ష్మి కచ్చితంగా పాల్గొనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో ఫోటోలలో, వీడియోలలో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మంచు లక్ష్మి అప్పట్లో జెమినీ టీవీ లో నిర్వహించిన మేము సైతం అనే ప్రోగ్రాం లో రామ్ చరణ్ ముఖ్య అతిథి గా పాల్గొని, ఆ షో కి విరాళం కూడా అందించాడు. ఇలా నేటి తరం లో మెగా మరియు మంచు కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా ఉంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here