Balakrishna : నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల తెలుగు వాళ్లు ఉన్న జై బాలయ్య అనేలా ఎదిగారు. అరవై ఏళ్ల వయసులో చాలా మంది హీరోలు సినిమాలు చేస్తున్నప్పటికీ బాలయ్య మాత్రం సమ్ థింగ్ స్పెషల్. అయితే నందమూరి బాలయ్య కెరీర్ లో క్లాసిక్ చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒక పాత్ర శ్రీకృష్ణ దేవరాయులుగా నటించారు. ఈ చిత్రంలో సిల్క్ స్మిత కీలక పాత్రలో నటించింది.
ఆమె రాజనర్తకిగా నటించి మెప్పించింది. ఈ క్రమంలో సిల్క్ స్మితని ప్రశంసిస్తూ బాలయ్య కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ సిల్క్ స్మితని గుర్తు చేసుకున్నారు. అసలు ఆ సినిమాలో సిల్క్ స్మితని తీసుకోవాలన్న ఆలోచన సింగీతం శ్రీనివాసరావు గారిదే. పీరియాడిక్ సినిమా కాబట్టి రాజ నర్తకిగా సిల్క్ స్మిత బాగా సూట్ అవుతుంది. కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో ఆమెని కొట్టే ఆడది లేనే లేదు అంటూ బాలయ్య బోల్డ్ గా చెప్పారు. ఆడది అని ఎందుకు అంటున్నానంటే.. అప్పటి స్టార్ హీరోయిన్లు అయిన శ్రీదేవి లాంటి వారు కూడా మేకప్ విషయంలో ఆమెను ఫాలో అయ్యేవారు అంటూ బాలయ్య తెలిపారు.
సిల్క్ స్మిత ఎలా మేకప్ వేసుకుంటుంది.. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటుందని ఆ నాటి టాప్ హీరోయిన్ దగ్గరుండి గమనించేవారు అని.. ఏ సినిమాకి ఎలాంటి లుక్ అవసరమో పర్ఫెక్ట్ గా సిల్క్ స్మిత అలాగే కనిపించేవారని బాలకృష్ణ తెలిపారు. అందులో ఆమె ఎక్స్ పర్ట్ అని చాలా మంది ప్రశంసల వర్షం కురిపించేవారట. ఇక బాలయ్య, సిల్క్ స్మిత కాంబినేషన్ లో ఆదిత్య 369 లో వచ్చే నెరజాణవులే అనే సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. సిల్క్ స్మిత ఇలాంటి పాత్రలు కూడా చేయగలదని ఆ సినిమాతో నిరూపించింది.