Guntur Kaaram : అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ దశ నుండే అంచనాలు భారీ గా ఉండేవి. ట్రేడ్ కూడా కళ్ళు మూసుకొని ఈ సినిమాకి బిజినెస్ చేసారు.
షూటింగ్ కూడా మొదలు కాకకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. దాదాపుగా 160 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. కమర్షియల్ సినిమా, పైగా సంక్రాంతి సీజన్ అవ్వడం తో బయ్యర్స్ ఎవ్వరూ కూడా రిస్క్ అని ఫీల్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడాట్రేడ్ లో సినిమాపై మంచి బజ్ ని ఏర్పడేలా చేసింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి పోటీగా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా చోట్ల గుంటూరు కారం కి థియేటర్స్ కొరత పడింది. ముఖ్యంగా వెస్ట్ గోదావరి అన్నీ బి,సి సెంటర్స్ లో ఉండే సింగిల్ థియేటర్స్ లో కేవలం రెండు షోస్ ని మాత్రమే ప్రదర్శించడానికి ఒప్పందం చేసుకున్నాడు ఆ చిత్రం డిస్ట్రిబ్యూటర్.
మిగిలిన అన్నీ చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఇలాంటి సమయం లో సినిమాని విడుదల చేస్తే పెట్టిన భారీ రేట్స్ కి నష్టాలను చూడాల్సి వస్తుంది అని , సినిమాని వాయిదా వెయ్యడం మంచిది అని బయ్యర్లు నిర్మాత నాగ వంశీ తో అన్నారట. కానీ నాగవంశీ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. ఇది సంక్రాంతి సినిమా , ఎట్టి పరిస్థితిలో జనవరి 12 న విడుదల కావాల్సిందే అని పట్టుబట్టాడట. దీంతో బయ్యర్స్ లో భయం మొదలైంది. చూడాలి మరి గుంటూరు కారం ఒకవేళ జనవరి 12 న విడుదలైతే ఇలాంటి సవాళ్ళను ఎలా ఎదురుకుంటుంది అనేది.