Guntur Kaaram : బ్రేకులు లేని లారీ లాగ దూసుకుపోతున్న ‘గుంటూరు కారం’ ట్రైలర్..పాన్ ఇండియన్ మూవీస్ రికార్డ్స్ అవుట్!

- Advertisement -

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ థియేట్రికల్ ట్రైలర్ నిన్న రాత్రి విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు మాస్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో మహేష్ బాబు మునుపెన్నడూ లేనంత మాస్ గా కనిపించడం, దానికి తోడు ఆయన డైలాగ్ డెలివరీ మరియు మ్యానరిజమ్స్, ఇలా ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ ఫ్యాన్స్, ఇంకా నాలుగు రోజులు ఎదురు చూడాలా అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు అంటే వాళ్లకి ఏ రేంజ్ లో నచ్చిందో ఊహించుకోవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్ లో మహేష్ బాబు ని బ్రేకులు లేని లారీ తో పోలుస్తారు గుర్తుందా, రికార్డ్స్ విషయం లో కూడా ఈ ట్రైలర్ బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది.

టాలీవుడ్ లో ఉన్న హీరోలందరికంటే మహేష్ బాబు సినిమా టీజర్స్ మరియు ట్రైలర్స్ కి అత్యధిక వ్యూస్ వస్తుంటాయి. ఆయనకీ ఉన్న రీచ్ అలాంటిది మరి. ఈ ట్రైలర్ కి కూడా ఊహించినట్టుగానే రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. 24 గంటలు కూడా గడవకముందే అప్పుడే ట్రైలర్ కి దాదాపుగా 25 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చేసాయి. 24 గంటలు గడవడానికి రాత్రి 9 వరకు సమయం ఉంది.

- Advertisement -

అంతలోపు ఈ ట్రైలర్ కచ్చితంగా 50 మిలియన్ వ్యూస్ ని కచ్చితంగా దాటేస్తుందని అంటున్నారు. ‘సలార్’ మూవీ ట్రైలర్ కి ఫుల్ రన్ లో కూడా 40 మిలియన్ వ్యూస్ రాలేదు, #RRR చిత్రం ట్రైలర్ కి కూడా 24 గంటల్లో గుంటూరు కారం రేంజ్ వ్యూస్ రాలేదు. ఒకవేళ ఈ ట్రైలర్ 24 గంటల్లో 50 మిలియన్ కి పైగా వ్యూస్ ని కొల్లగొడితే మహేష్ బాబు టాలీవుడ్ కి కొత్త బెంచ్ మార్క్ పెట్టినవాడు అవుతాడు, చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here