Salaar : ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు థియేటర్స్ లో వసూళ్లు డ్రాప్ అవుతున్న సమయం లో కొత్త సన్నివేశాలు జతచేసేవారు. కేవలం ఆ సన్నివేశాల కోసం థియేటర్స్ కి వెళ్లేవారు ఆడియన్స్. కలెక్షన్స్ బాగా పెరిగేవి. ఇప్పుడు సలార్ చిత్రం కోసం కూడా అదే చెయ్యబోతున్నారు.

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి మామూలు వర్కింగ్ డేస్ లో చల్లబడిన ఈ సినిమా వసూళ్లకు బూస్ట్ ని పెంచుతూ సరికొత్త సన్నివేశాలను జతపర్చబోతున్నారని సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. గతం లో ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి సినిమాకి ఇలాగే చేసారు. బాగా వర్కౌట్ అయ్యింది. వర్షం లో వచ్చే ఫైట్ సీన్ ని యాడ్ చెయ్యడం వల్ల అదనంగా మరో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు అదే ఫార్ములా కి సలార్ కి ఉపయోగించబోతున్నారు.

థియేటర్స్ లో మంచి రన్ ఉన్న ఈ సినిమాకి సంబంధించిన థియేటర్స్ ని సంక్రాంతి వరకు హోల్డ్ చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. సంక్రాంతి వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి, అప్పుడు సరికొత్త సన్నివేశాలను జతపర్చాలని చూస్తున్నారు. ఈ సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో వస్తాయి అట. రెండు అదిరిపోయే యాక్షన్ ఫైట్ బ్లాక్స్ ని జతపర్చబోతున్నారట.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుంది. అలాగే రీ షూటింగ్ చేస్తున్న సమయం లో ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్ లో లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సాంగ్ ని చిత్రం నుండి తొలగించేసారు. ఇప్పుడు ఆ సాంగ్ ని కూడా జతపర్చబోతున్నారట మూవీ టీం. ఈ న్యూ వెర్షన్ ఆడియన్స్ కి ఇంకా బాగా నచ్చుతుందని, సలార్ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు, చూడాలి మరి.
