RAVITEJA : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , చిన్న చిన్న పాత్రల ద్వారానే పెద్ద అవకాశాలను సొంతం చేసుకొని, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన రవితేజ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ముఖ్యంగా ఆయన మాస్ ని మరియు కామెడీ టైమింగ్ కి అన్నీ వర్గాల్లో సమానమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన రవితేజ, మధ్యలో కొన్ని చెత్త సినిమాల కారణంగా తన మార్కెట్ రేంజ్ ని తగ్గించుకున్నాడు.
ఇప్పటికీ కమర్షియల్ సినిమా సూపర్ హిట్ అయితే రవితేజ అవలీల గా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతున్నాడు కానీ వంద కోట్ల షేర్ క్లబ్ లోకి చేరడం మాత్రం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఇకపోతే రీసెంట్ గానే ఆయన గోపీచంద్ మలినేని తో ఒక సినిమాని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
గతం లో ఆయన రవితేజ తో క్రాక్ మరియు బలుపు వంటి సూపర్ హిట్ సినిమాలను తీసాడు. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో చిత్రం కావడం తో ఈ సినిమా పై ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా నిర్మాత నవీన్ ఎర్నినేని మరియు రవితేజ కి మధ్య చిన్న క్లాష్ ఏర్పడింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
సినిమా బడ్జెట్ మరియు రవితేజ రెమ్యూనరేషన్స్ అన్నీ కలుపుకొని 120 కోట్ల రూపాయలకు పైగానే అవుతుందట. రెమ్యూనరేషన్ ని తగ్గించుకోమని రవితేజ ని నిర్మాతలు రిక్వెస్ట్ చేశారట. కానీ ఆయన ససేమీరా నో చెప్పడం తో, నీకున్న మార్కెట్ కి ఇంత బడ్జెట్లు పెట్టి సినిమాలు తియ్యలేం అని ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశారట నిర్మాతలు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.