Junior NTR : RRR చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిన్న మొన్నటి వాకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకింది. ఆయనకి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ప్రతీ ఒక్కరికి ఎదో ఒక వస్తువు పైన వ్యామోహం ఉంటుంది.

అలా మన జూనియర్ ఎన్టీఆర్ కి కూడా చేతి వాచ్ మీద అధిక వ్యామోహం ఉంటుందట. ఆయన ధరించే ప్రతీ వాచ్ విలువ లక్షల నుండి కోట్లలో ఉంటుంది. మార్కెట్ కొత్త రకం వాచ్ వచ్చిందంటే చాలు, అది ఎన్టీఆర్ ముందు ఉండాల్సిందే. అంత పిచ్చి ఆయనకి వాచ్ అంటే, అయితే ఒక సినిమా షూటింగ్ సమయం లో తనకి ఎంతో ఇష్టమైన వాచ్ పోయేసరికి ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డాడట.

ఈ సంఘటన జరిగిన రోజు ఎన్టీఆర్ షూటింగ్ లొకేషన్ లో ఎదో ఆస్తి మొత్తం పొయ్యినట్టు నీరసంగా కూర్చున్నాడట. అలా నిరాశతోనే ఇంటికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, పక్కరోజు తన సినిమా హీరోయిన్ చేతికి అదే వాచ్ ని చూసి, ఇది నా వాచ్ కదా, నీ చేతికి ఎలా వచ్చింది, ఆమ్మో దొంగ దొంగ అంటూ సెట్ లో కాసేపు సరదాగా ఆ హీరోయిన్ ని ఆట పట్టించాడట. దానికి ఆ హీరోయిన్ కాస్త హర్ట్ అయ్యిందట.

షాపింగ్ కి వెళ్ళినప్పుడు క్రింద పడిపోయి ఉండడం చూసి చేతికి తగిలించుకున్నాను అని, ఇది నీ చేతి వాచ్ అని తెలియదు అంటూ ఆ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది అట. దీంతో ఎన్టీఆర్ నేను ఊరికే సరదాగా అన్నాను, బాధపడకు అని ఆ హీరోయిన్ ని ఓదార్చాడు అట. ఆ వాచ్ విలువ దాదాపుగా కోటి 50 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
