మొదట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత విలన్ గా మారి మళ్లీ హీరో అయ్యారు గోపీచంద్. మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్స్ సాధించిన ఆయన ఈ మధ్య రేసులో చాలా వెనుకబడ్డారు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ఏ సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేదు. తాజాగా వర్సటైల్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్లో ఓ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కొద్ది రోజుల క్రితమే జరిగింది. ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గోపీచంద్. కానీ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడంతో నిర్మాత నష్టాల పాలయ్యారు.

అయితే దర్శకుడు శ్రీను వైట్లకు కూడా ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు. దీంతో భారీ బడ్జెట్ ఇచ్చే నిర్మాతలు కూడా ఆయనకు లేరు. దీంతో మినిమం బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా గోపీచంద్ కు సంబంధించి ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. వరుస ఫ్లాపుల కారణంగా గోపీచంద్ తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే తగ్గించేశాడని తెలుస్తోంది. రామబాణం సినిమాకి ఆయన రూ .8 కోట్ల వరకు చార్జ్ చేశాడట. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో శ్రీనువైట్ల సినిమాలో నటించేందుకు తాను రూ.5 కోట్లే తీసుకుంటున్నట్లు సమాచారం. వరుస ప్లాప్స్ పడడంతో గోపీచంద్ మార్కెట్ పడిపోయింది. ఈ నేపథ్యంలోనే రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్.. హీరో ఇద్దరికీ సక్సెస్ చాలా ముఖ్యం.
