హన్సిక మోత్వానీ బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగింది. దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తర్వాత కన్నడలో కూడా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. కోలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని హిందీ వంటి భాషలలో కూడా చక్రం తిప్పింది. చాలా చిన్న వయసులోనే దేశమంతా పాపులర్ అయింది. గతేడాది బ్యాచిలర్ లైఫ్ వీడి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. అప్పట్లో హీరో శింబు తో కూడా ప్రేమాయణం నడిపిందని ప్రచారం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబుతున్నారని వార్తలు కూడా వినిపించాయి. నిజంగానే హన్సిక, శింబు మధ్య లవ్ ట్రాక్ నడిచిందట.
కానీ అప్పటికే శింబు లేడీ సూపర్ స్టార్ నయనతారతో బ్రేకప్ అయింది. దీంతో బాధలో దగ్గరైన హన్సికను చాలా గాఢంగా ప్రేమించారట. ఆ సమయంలోనే హన్సిక తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు, హీరో ఉదయనిధితో కలిసి పలు సినిమాలలో నటించింది. ఉదయనిధి హన్సిక నటించిన ఓకే ఓకే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా వారిద్దరు కలిసి పలు సినిమాలలో నటించారు. దీంతో ఉదయనిధి, హన్సిక మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. ఈ విషయం కోలీవుడ్లో వైరల్ గా అయింది. వారిద్దరి విషయం శింబు వరకు వెళ్లిందట. హన్సికని పిలిచి అడిగారట.. కానీ అదేం లేదని ఆమె ఎంత చెప్పినా సరే.. వినకుండా హన్సికను డైలీ కొడుతూ టార్చర్ చేసేవారట. దీంతో ఆ టార్చర్ భరించలేకనే హన్సిక అతనికి బ్రేకప్ చెప్పిందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. దీంతో చెన్నై నుండి హన్సిక ముంబైకి మకాం మార్చేసిందట. అలా హన్సిక, శింబు మధ్య గ్యాప్ పెరిగిందట.