Aarti Agarwal : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు తమ అభిమానులకు ఎల్లప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఆర్తీ ఆగర్వాల్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ ఆర్తీ ఆగర్వాల్ ఒకరు. నువ్వు నాకు నచ్చావ్, ఇంద్ర, చెన్న కేశవ రెడ్డి, అందాల రాముడు చిత్రాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగిన ఆర్తీ అగర్వాల్ తాను తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా కెరీర్ నాశనం అయింది. ఇండస్ట్రీలో ఎంత త్వరగా స్టార్ స్టేటస్ అందుకుందో అంతే త్వరగా డౌన్ ఫాల్ అయింది. అవకాశాలను పోగొట్టుకుని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆర్తీ అగర్వాల్ వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడింది. పెళ్లి తర్వాత ఆమె అధిక బరువు కావడంతో తగ్గడానికి లైఫో సర్జరీ చేయించుకుంది. కానీ అది వికటించడంతో చిన్న వయసులోనే కన్నుమూసింది. కానీ ఆర్తి అగర్వాల్ మరణానికి కారణం అది కాదని పలు రకాల రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.

ఇది ఇలా ఉంటే.. ఆర్తీ అగర్వాల్ సినిమాలు చేస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో తండ్రి మంచి ప్రపోజల్ తో తన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న స్టార్ సెలబ్రెటీ హోదాను కూడా పక్కన పెట్టి తన కొడుకు సంతోషం కోసం ఆర్తీ అగర్వాల్ దగ్గరకు వచ్చి నా కొడుకు నిన్ను ఇష్టపడుతున్నాడు పెళ్లి చేసుకోమని అడిగాడట. కానీ ఈ ప్రపోజల్ ను ఆలోచించకుండా ఆమె రిజెక్ట్ చేశారని వార్త హల్ చల్ చేస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. తాను అప్పటికే తరుణ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సమాచారం. అందుకే ఆ స్టార్ హీరో కుమారుడిని రిజెక్ట్ చేసిందట. అయితే చివరికి తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. వారికి నచ్చిన వ్యక్తితోనే పెళ్లి జరిపించడంతో.. ఇష్టం లేని పెళ్లి చేసుకుని చాలా బాధపడి చివరికి బరువు బాగా పెరిగిపోయిందట. అలా అది తగ్గడం కోసం లైఫో చేయించుకుని అది వికటించి చనిపోయిందట.
