తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో హీరోలతో సమానమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు. ఆ ఇద్దరు ముగ్గురిలో ఒకరే కాజల్ అగర్వాల్. ఈమెకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం ఆమె కోసం మాత్రమే థియేటర్స్ కి క్యూలు కట్టే ఆడియన్స్ ఉంటారు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

‘లక్ష్మి కళ్యాణం’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన ఈమె ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని, కోట్లాది అంన్డి అభిమానులను సంపాదిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. చందమామ సినిమాతో తొలి సూపర్ హిట్ ని అందుకున్న కాజల్ ఆ తర్వాత ‘మగధీర’ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ సినిమా తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు మరియు తమిళం బాషలలో దాదాపుగా ప్రతీ స్టార్ హీరోతో కలిసి నటించిన కాజల్ అగర్వాల్, పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ దూకుడు తో ఇండస్ట్రీ లో దూసుకెళ్తుంది . అయితే ఇంతపెద్ద హీరోయిన్ కూడా తన మొదటి సినిమా ‘లక్ష్మీ కళ్యాణం’ అప్పుడు డైరెక్టర్ తేజ చేతిలో తిట్లు , తన్నులు పడ్డాయట. కోపం తో తేజ తన చేతిలో ఉన్న బెల్టు తీసుకొని కొట్టినట్టు కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతే కాదు అప్పట్లో ఆయన కాజల్ అగర్వాల్ గురించి ఇంటర్వ్యూస్ లో చాలా తక్కువ చేసి కూడా మాట్లాడినట్టు సమాచారం.

కాజల్ అగర్వాల్ కి అసలు ఒక్క డైలాగ్ కూడా గుర్తు ఉండదని, మెమరీ పవర్ సూన్యం అని, ఆమె చేత డైలాగ్స్ చెప్పించడానికి నానా తిప్పలు పడ్డామని . ఆమె డైలాగ్స్ మర్చిపోతూ ఉండేసరికి వెనక నుండి మేము మాటలు అందిస్తూ ఉండేవాళ్లమని, ఎక్సప్రెషన్స్ ఇవ్వడం కూడా ఆమెకి రాదు అంటూ ఎన్నో మాటలు అన్నాడట అప్పటి ఇంటర్వ్యూస్ లో. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.