Nana Patekar : అక్కడ ఓ మూవీ షూటింగ్ జరుగుతోంది. తన ఫేవెరెట్ యాక్టర్ ని సెల్ఫీ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించాడో ఫ్యాన్. దీంతో ఆ యువకుడిపై చెయ్యి చేసుకున్నాడు బాలీవుడు సీనియర్ యాక్టర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ యాక్టర్ ఎవరో కాదు.. వర్సటైల్ యాక్టింగ్ తో ఫేమ్ తెచ్చుకున్న సీనియర్ యాక్టర్ నానా పటేకర్. ఈయన ప్రస్తుతం ఓ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన యువకుడిని చితక్కొట్టాడు. దీంతో ఆయనను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Video of @nanagpatekar slapping a fan, wanting a selfie during shooting in Kashi goes viralpic.twitter.com/1SWLeSpZtw
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 15, 2023
సినిమా షూట్‌లో భాగంగా ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్నారు నానా పటేకర్. వారణాసిలో షూటింగ్ జరుగుతుండగా.. అక్కడి స్థానికులు ఆయన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. పర్మిషన్ లేకుండా ఆయన దగ్గరకు వెళ్లేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. దీంతో అసహనానికి గురైన నానాపటేకర్.. యువకుడి తలపై గట్టిగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
నానా పటేకర్ బిహేవియర్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సెల్ఫీ ఇవ్వడం నచ్చకపోతే ఇవ్వను అని చెప్పకుండా.. అందరిముందు కొట్టడం కాదంటున్నారు. మరోవైపు కొందరు నానాపటేకర్ చేసింది కరెక్టే అని ఆయన్ని సమర్థిస్తున్నారు. షూట్ మధ్యలో సెల్ఫీ తీసుకోవడం ఆ యువకుడి తప్పని అంటున్నారు.
