Devara : దుమ్ములేపేసిన ‘దేవర’ సరికొత్త టీజర్..విలన్ కి కూడా ఈ రేంజ్ మాస్ ఊహించి ఉండరు!

- Advertisement -

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ పై రోజు రోజుకి అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి గ్లిమ్స్ వీడియో కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూసాము. నేడు ఈ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘సైఫ్ అలీ ఖాన్’ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. ఈ వీడియో కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ బైరా అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకి ప్రత్యేకమైన ఎలివేషన్స్ కొరటాల శివ రాసుకున్నట్టు ఈ వీడియో ని చూస్తే అర్థం అవుతుంది.

Devara
Devara

అంతే కాకుండా అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ గ్లిమ్స్ లో సైఫ్ అలీ ఖాన్ కుస్తీ ఫైటింగ్ చేస్తున్నట్టుగా, ఒక్కొక్కరిని విసిరి వేస్తున్నట్టుగా చూపించారు. ఎన్టీఆర్ కి సైఫ్ అలీ ఖాన్ మధ్య కూడా ఈ కుస్తీ ఫైట్ సన్నివేశం ఉంటుందని తెలుస్తుంది. అంతే కాకుండా సైఫ్ అలీ ఖాన్ లుక్స్ కూడా ఈ గ్లిమ్స్ వీడియో లో అదిరిపోయాయి. సాధారణమైన విలన్ కాకుండా, హీరో కి సరిసమానంగా, ఎక్కడా తగ్గకుండా సైఫ్ అలీ ఖాన్ ని చూపించినట్టు ఈ గ్లిమ్స్ వీడియో ని చూస్తే అర్థం అవుతుంది.

Devara: Part 1' to release romantic single 'Heartbeats' on Aug 5 - The Statesman

- Advertisement -

మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ కంటెంట్ కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులకు కూడా నచ్చింది. ముఖ్యంగా ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. పది రోజుల క్రితం విడుదలైన ‘చుట్టమల్లే’ అనే లిరికల్ వీడియో సాంగ్ కి అప్పుడే యూట్యూబ్ లో 60 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. త్వరలోనే ఈ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిల్చిన ‘ఆయుధ పూజ’ పాట ని కూడా విడుదల చెయ్యబోతున్నారు. ఈ పాట ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకంటే అద్భుతంగా ఉంటుందట. ఇలా అన్నీ విధాలుగా అంచనాలను పెంచేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here