Kruthi Shetty : కృతిశెట్టి వల్ల చాలా నష్టపోయాం.. లబోదిబోమంటున్న మేకర్స్

- Advertisement -

Kruthi Shetty : నిజానికి సినిమాలు తీయడం ఓ ఎత్తు అయితే వాటిని జనంలోకి తీసుకెళ్లడం మరో లెవల్. అందుకే ప్రతీ సినిమాకు ముందే ఫస్ట్ లుక్స్, టీజర్లు, గ్లింప్స్‌, ట్రైలర్లు వంటివి విడుదల చేస్తుంటారు మేకర్స్. దీంతో పాటు హీరో, హీరోయిన్లు, చిత్రబృందంలోని ప్రముఖులు కూడా మూవీ ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ ఉంటారు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తోపాటు సినీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వల్ల నటీనటుల వల్ల ప్రమోషన్స్ చిత్ర నిర్మాతలకు చాలా ఇంపార్టెంట్. ఒక మూవీ సక్సెస్, ఫెయిల్యూర్‌లను ప్రభావితం చేసేది కూడా నటీనటులే. కాబట్టి వారు తప్పక ప్రమోషన్లను హాజరు కావాలని కోరుకుంటారు చిత్ర మేకర్స్. అయితే అడిగినా, అడగకపోయినా చాలాసార్లు మేకర్స్‌తోపాటు హీరో హీరోయిన్లు ఆయా వేదికలపై ప్రమెషన్లలో భాగమవుతారు. నటీనటులు ఇంటర్వ్యూల్లో పాల్గొని తమ మూవీని ప్రమోట్ చేస్తుంటారు. అలా చేయకుండా భారమంతా దర్శక, నిర్మాతలపైనే పైనే వదిలేస్తే కొన్నిసార్లు సినిమాకు నష్టం జరగవచ్చు. ప్రస్తుతం ‘మనమే’ సినిమాకు అదే పరిస్థితి ఎదురైందట.

పీపుల్స్ మీడియా బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే గతవారం పెద్ద చెప్పుకోదగ్గ చిత్రాలేవీ థియేటర్స్‌లో విడుదల కాలేదు. కాస్త ఆసక్తి కలిగిన సినిమా ఏదైనా ఉందంటే శర్వానందన్, కృతిశెట్టి నటించిన మనమే సినిమానే. అందులో వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. విడుదలకు ముందు పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. జూన్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. కాగా యావరేజ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

కానీ ఆ బజ్ సక్సెస్‌కు సరిపోదని, ప్రమోషన్స్‌లో కనీసం రెండు మూడ్రోజుల పాటు అయినా పాల్గొనాలని మనమే మూవీ మేకర్స్ హీరోయిన్ కృతిశెట్టిని అడిగారట. కానీ ఆమె మాత్రం తాను తమిళ్ మూవీ ఒప్పుకున్న కారణంగా నో చెప్పేసిందట. దీంతో కలెక్షన్స్ తగ్గాయట. రూ. 12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ. 13 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఆరు రోజులు పూర్తయ్యేనాటికి రూ. 6.13 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక బ్రేక్ ఈవెన్‌కి ఇంకా రూ. 6.87 కోట్లు రాబట్టాల్సి ఉండగా, కృతిశెట్టి హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇక ఆ డబ్బులు వచ్చే చాన్స్ లేదని మూవీ టీమ్ నిరాశగా ఉందట. ఆమెను నమ్ముకుని సినిమా తీస్తే నష్టపోయామని దర్శక, నిర్మాతలు బాధపడుతున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here