Bigg Boss : తెలుగు ఆడియన్స్ ఎంతో ఇష్టంగా చూసే ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి బిగ్ బాస్. మొదట్లో ఆడియన్స్ కి పెద్దగా అర్థం కాలేదు కానీ, ఆ తర్వాత ఈ షో బాగా అలవాటు అయ్యి ఆరు సీజన్స్ ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్న సీజన్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ లోకి ది బెస్ట్ సీజన్ ఇదే అని చెప్పొచ్చు. గత రెండు సీజన్ నుండి 24 గంటలు డిస్నీ + హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అవ్వడం వల్ల ఆడియన్స్ కంటెస్టెంట్స్ విషయం లో ఇంకా క్లారిటీ గా ఉంటున్నారు. హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ ఎపిసోడ్స్ కూడా టీవీ లో టెలికాస్ట్ అయ్యే గంట ముందు అప్లోడ్ అవుతుంటాయి.
అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఎగ్జిట్ ఇంటర్వ్యూస్ కూడా డిస్నీ + హాట్ స్టార్ లోనే అప్లోడ్ చేస్తున్నారు. అయితే సీజన్ 1 నుండి సీజన్ 4 వరకు అన్నీ ఎపిసోడ్స్ ని హాట్ స్టార్ నుండి తొలగించేసారు. ఆడియన్స్ ఈ సీజన్స్ ని ఎక్కడ చూడాలో తెలియక సతమతమవుతున్నారు. టోరెంట్స్ లో కూడా ఈ సీజన్స్ అందుబాటులో లేవు. అయితే సీజన్స్ ని తొలగించడానికి కారణం, ఆహా డిజిటల్ మీడియా వాళ్ళే అని తెలుస్తుంది.
ఈ ఎపిసోడ్స్ అన్నిటిని ఒక ఫ్యాన్సీ రేట్ కి అమ్మేసారట బిగ్ బాస్ టీం. అతి త్వరలోనే ఈ ఎపిసోడ్స్ మొత్తాన్ని ఆహా మీడియా లో చూడొచ్చు. కాబట్టి ముందు సీజన్స్ అభిమానులు ఇది గమనించగలరు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.