Jersy Actress : కేవలం అందాల ఆరోబోతకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా నటనకి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లు మన సౌత్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రద్ద శ్రీనాథ్. ఈమె ఇప్పటి వరకు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ వచ్చింది. వాటిల్లో ‘జెర్సీ’ ద్వారా ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన సినిమాలు కూడా ఆమెని నటిగా మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.

కన్నడ ఇండస్ట్రీ లో కెరీర్ ని ప్రారంభించిన శ్రద్ద శ్రీనాథ్, ఆ తర్వాత తెలుగు, తమిళం , హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా ఈమె వెంకటేష్ తో ‘సైన్ధవ్’ అనే చిత్రం చేసింది. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది శ్రద్ద శ్రీనాథ్. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

ఇంస్టాగ్రామ్ లో శ్రద్ద శ్రీనాథ్ తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆమె అప్లోడ్ చేసే ఫోటోలలో ఆమె ఎదపై ఉన్న టాటూ గురించి అభిమానులు అడుగుతూ ఉంటారు. ఆ టాటూ ఎవరి కోసం వేసుకున్నావ్ అని, కానీ శ్రద్ద శ్రీనాథ్ సమాధానం ఇచ్చేది కాదు. కానీ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో మాత్రం ఆ టాటూ వెనుక ఉన్న రహస్యం చెప్పేసింది.

ఆమె మాట్లాడుతూ ‘నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతని కోసమే నేను ఈ టాటూ ని లవ్ అని వేయించుకున్నాను. ఆ అబ్బాయి వల్లే నాకు బీటిల్స్ బ్యాండ్ గురించి తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ఏమిటి అని ఆరా తియ్యగా కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించిన ఒక యంగ్ హీరో అని తెలిసింది.
