Sudheer Babu : డ్రాయర్ వేసుకోవడం మానేశానంటున్న హీరో సుధీర్ బాబు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

- Advertisement -

Sudheer Babu : హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన మొదటి సారిగా ఏ మాయ చేసావే సినిమాలో సమంతకు అన్నగా నటించారు. ఆ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత శివ మనసులో శృతి(SMS) అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి మార్కులే పడ్డాయి. దీంతో తర్వాత ప్రేమ కథా చిత్రమ్‎తో కెరీర్లో తొలి హిట్ అందుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను సాధించింది. దీంతో ఆయన ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇక తర్వాత ఆడు మగాడ్రా బుజ్జీ, దొంగాట, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, శ్రీ శ్రీ, హిందీలో బాఘీ లాంటి చాలా సినిమాల్లో నటించారు. అయినా ఆయకు సక్సెస్ అంతగా రాలేదు.

మరోసారి సుధీర్ బాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక డైరెక్షన్లో తెరకెక్కిన హరోం హర మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ జూన్ 14న అంటే నేడు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీటీం ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇందులో సుధీర్ బాబు చేసిన పలు కామెంట్స్ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అయితే దర్శకుడు తమకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయని వాటిని మూవీ టీం అందరిపై రుద్దేస్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటని హీరో సుధీర్ బాబును అడగగా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు.

- Advertisement -

సుధీర్ బాబు మాట్లాడుతూ.. దర్శకుడు ఏం చెప్పినా చేయాలనిపిస్తుంది. తనకు న్యూమరాలజీ, దేవుడి మీద నమ్మకం ఎక్కువ. వీటి పై ఆయన చాలా నాలెడ్జ్ ఉందనిపిస్తుంది. అందుకే ఆయన చెప్పినవి రియల్ లైఫ్‌లో కూడా పాటించాలి అనిపిస్తుంటుంది. ఆయన నాతో సినిమా చేస్తున్న క్రమంలో బ్లాక్ కలర్ కారు ఉంటే దానిని మార్చేయమని సజెస్ట్ చేశారు. దీంతో వెంటనే అది మార్చేశాను. అలాగే ఆయన బ్లాక్ కలర్ మొత్తానికే వాడకూడదని చెప్పడం వల్ల నేను నా బ్లాక్ కలర్ అండర్ వేర్ కూడా వేసుకోవడం లేదు. అసలు సినిమాను ప్రకటించిన అప్పటి నుంచి బ్లాక్ కలర్ వాడటం మానేశానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here