ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంత మంది డైరెక్టర్స్ దగ్గర పని చేసి, హీరో గా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఎన్నో ఓడిడుగులు ఎదురుకొని చివరికి ‘అష్టాచమ్మా’ అనే సినిమా ద్వారా హీరో గా మారి, తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న నటుడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత ఆయన కెరీర్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది.

అలా సాగిపోతున్న ఆయన కెరీర్ కి ‘అలా మొదలైంది’ అనే చిత్రం మొట్టమొదటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆయన కెరీర్ ని మరో మలుపు తిప్పిన చిత్రం ‘భలే భలే మొగాడివోయ్’. ఈ సినిమా తర్వాత నాని వెనక్కియి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఎన్నో యూత్ ఫుల్ హిట్స్ ని అందుకున్న నాని రీసెంట్ గా ‘దసరా’ చిత్రం తో వంద కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకున్నాడు.

ఇకపోతే నాని పొరపాటున హీరో అయ్యాడు కానీ, ఆయన ఇండస్ట్రీ కి ఒక డైరెక్టర్ అవుదామని వచ్చాను అన్న విషయం అనేక సందర్భాలలో తెలిపాడు. అప్పట్లో ఆయన మన డైరెక్టర్ అయితే మన స్టార్ హీరోస్ తో ఎలాంటి సినిమాలు తియ్యాలో ప్రతీ ఒక్కరికీ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడట. అలా తానూ డైరెక్టర్ అయితే మొట్టమొదట జూనియర్ ఎన్టీఆర్ తో ఎలా అయినా ఒక సినిమా తియ్యాలని అనుకుంటూ ఉండేవాడట.

కానీ కెరీర్ అనుకోకుండా యూ టర్న్ తీసుకోవడం వల్ల హీరో అవ్వడం, స్టార్ స్టేటస్ దక్కడం, తన సినిమాలతో తాను బిజీ అవ్వడం వల్ల దర్శకత్వం బాధ్యతలు పక్కన పెట్టేసాడట. అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా సినిమా చేస్తానని, కానీ చేస్తే నా మొట్టమొదటి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తోనే ఉంటుందని, లేకపోతే నన్ను నేనే పెట్టుకొని సినిమా తీసుకుంటాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు నాని.