Double Ismart : యూట్యూబ్ ని ఊపేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ స్టెప్పా మార్ సాంగ్..మణిశర్మ మాస్ అంటే ఇదే!

- Advertisement -

Double Ismart : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత పూరి జగన్నాథ్ కి అటు దర్శకుడిగా, నిర్మాతగా భారీ సక్సెస్ ని ఇచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. లవ్ స్టోరీస్ తీసుకుంటూ యూత్ లో మంచి ఇమేజి తెచ్చుకుంటున్న హీరో రామ్ కి ఊర మాస్ ఇమేజిని తెచ్చిపెట్టిన చిత్రమిది. అంతే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ మని శర్మ కి పునర్జన్మ ని ఇచ్చిన చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం లోని ప్రతీ పాట అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ సినిమాలోని పాటలే వినిపించేవి. మరి ఆ స్థాయి లో ఆడియో పరంగా కూడా హిట్ అయినా ఈ సినిమాకి సీక్వెల్ గా ‘డబల్ ఇస్మార్ట్’ అనే చిత్రం తెరకెక్కుతుంది అంటే కచ్చితంగా ఆడియన్స్ లో అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయి లో ఉంటాయి.

Double Ismart | పూరీ 'డ‌బుల్ ఇస్మార్ట్‌' వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ అదేనా?-Namasthe Telangana

ఆ అంచనాలకు తగ్గట్టుగానే నేడు విడుదలైన ‘స్టెప్పా మార్’ పాట నిల్చింది. మణిశర్మ అదిరిపొయ్యే రేంజ్ మాస్ బీట్స్ ఇవ్వగా హీరో రామ్ అదే స్థాయిలో అద్భుతమైన డ్యాన్స్ కనబరుస్తూ దుమ్ము దులిపేసాడు. ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి హీరో రామ్ వేసిన డ్యాన్స్. ఈ సినిమాలో అంతకు మించిన డ్యాన్స్ లు ఉన్నాయని ఈ పాటతో అర్థం అయ్యింది. ఇది ఇలా ఉండగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం లో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, నబ్బా నటేష్ నటించగా, డబుల్ ఇస్మార్ట్ చిత్రం లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

Ram Pothineni's 'Double iSmart' Release Date Postponed - Sacnilk

అలాగే ఈ చిత్రం లో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియాలంటే ఆగష్టు 15 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. వాస్తవానికి ఆగష్టు 15 వ తేదీన పుష్ప 2 చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ చిత్రం డిసెంబర్ 6 వ తేదికి వాయిదా పడడంతో డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆ సినిమా స్థానం లో విడుదల కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here