Bigg Boss : గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ గురించి ఏ రేంజ్ లో చర్చలు నడుస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. బాల్స్ టాస్క్ లో అమర్ దీప్ మరియు ప్రశాంత్ మధ్య ఫిజికల్ అవ్వడం, ప్రశాంత్ అమర్ మెడని బలంగా నొక్కి పట్టుకోవడం, ప్రశాంత్ చెయ్యి ని విడిపించుకోవడానికి అమర్ దీప్ అతన్ని కొరకడం ఇవన్నీ జరిగాయి.

ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా మాటల యుద్ధం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో మాటల యుద్ధం జరగడం కొత్తేమి కాదు. అమర్ దగ్గర ఉన్న పాయింట్స్ ప్రకారం అతను కరెక్ట్, ప్రశాంత్ దగ్గర ఉన్న పాయింట్స్ ప్రకారం అతను కరెక్ట్. కానీ ఎప్పుడైతే అమర్ దీప్ ప్రశాంత్ ని మెడికల్ రూమ్ కి తోసుకుంటూ పోయాడో, అక్కడి నుండి అమర్ పై నెగటివిటీ తారాస్థాయికి చేరుకుంది.

ప్రశాంత్ కూడా కావాలని సింపతీ గేమ్ ఆడుతున్నాడు అని అతని మీద కూడా నెగటివిటీ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రశాంత్ నేను అసలు అమర్ మెడని పట్టుకోలేదు, కొరికాడు, సరుకు తగిలింది, కొరుకుతున్నాడు అని గట్టిగా అరిచాను, లేకపోతే ఇంకా గట్టిగా కొరికేవాడు అని అంటాడు. అయితే అమర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ప్రశాంత్ అమర్ మెడని గట్టిగా పట్టుకున్న వీడియో ని అప్లోడ్ చేసి ప్రశాంత్ కావాలని నెగటివ్ చేస్తున్నాడు అని నిరూపించారు.

అంతే కాదు అమర్ కి మెడికల్ రూమ్ లో టెస్టులు కూడా జరిగాయని, ప్రశాంత్ మెడ పట్టుకున్నప్పుడు అమర్ మెడ మీద గీతలు కూడా పడినట్టు మెడికల్ రూమ్ లో చెప్పారని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఈ గొడవ ప్రభావం ఇద్దరి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
