Pawan Kalyan : మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 3 హీరోల లిస్ట్ తీస్తే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఉంటాడు. ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు సాదిస్తుంటాయి. ఇప్పటికీ ఆయనకీ వచ్చేంత ఓపెనింగ్స్ మన తెలుగు హీరోలకు రావు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి సందర్భంలో, ఏ సినిమాని రీమేక్ చేసినా కూడా ఓపెనింగ్స్ పెట్టగలడు.

అందుకే పవన్ కళ్యాణ్ కి వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఎవ్వరూ వెనుకాడరు. సినిమాల్లో ఆయన రేంజ్ ఇలాంటిది. ఈ రాజకీయాలు లేకుండా, ఆయన కేవలం సినిమాలు మాత్రమే చేస్తూ ఉండుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇండియా లోనే లేడని అంటూ ఉంటారు ట్రేడ్ పండితులు. కానీ సంపాదించిన డబ్బులు మొత్తం పవన్ కళ్యాణ్ దానధర్మాలకే ఉపయోగిస్తూ వచ్చాడు.

ఒకానొక సమయం లో తన చిన్న అన్నయ్య నాగబాబు సినిమాకి భారీ నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకునే రేంజ్ పరిస్థితి ఏర్పడినప్పుడు, పవన్ కళ్యాణ్ తాను ఎంతో కస్టపడి సంపాదించుకున్న డబ్బుతో కట్టుకున్న ఇల్లుని అన్నయ్య కోసం అమ్మేసాడట. ప్రస్తుతం బాలయ్య ఉంటున్న ఇంటి సమీపం లోనే పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ఉండేది. ఎంతో సుందరంగా ఉండే ఆ ఇల్లుని కొన్నది మరెవరో కాదు, మన టాలీవుడ్ లో ఒక ప్రముఖ యంగ్ హీరో కి సంబంధించిన నాన్ననే అట.

ఆ యంగ్ హీరో నాన్న ఇది వరకు నైజాం లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేసాడు. అంతే కాకుండా ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆయన ఎవరో మీకు ఈపాటికి అర్థం అయ్యే ఉంటుంది. రీసెంట్ గానే ఆ యంగ్ హీరో ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.