Salaar : కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. టికెట్స్ ఆన్లైన్ లో ఎప్పుడు పెడుతున్నారో, అవి ఎప్పుడు అయిపోతున్నాయో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. ఆ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న ఊపుని చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా మొదటి రోజు 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. హిందీ లో కూడా కాస్త షోస్ ని కేటాయిస్తే కచ్చితంగా ఈ చిత్రం ఓపెనింగ్ ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం విడుదల సందర్భంగా ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మా దృష్టికి వచ్చాయి , అవేంటో ఒకసారి చూద్దాం.

ఇప్పటి వరకు విడుదలైన రెండు ట్రైలర్స్ లో ప్రభాస్ మరియు పృథ్వీ రాజ్ పాత్రలకు సంబంధించిన చిన్నప్పటి రోల్స్ ని చూసాము. ఎవరు ఈ పిల్లలు ఇద్దరూ, చాలా ఇంటెన్స్ గా డైలాగ్స్ చెప్పారు అని అనుకున్నారు. ముఖ్యంగా పృథ్వీ రాజ్ చిన్నప్పటి క్యారక్టర్ చేసిన కుర్రాడు అందరి దృష్టిలో పడ్డాడు. అతని పేరు కార్తికేయ దేవ్. ఇతను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. తన సొంత జిల్లా ప్రకాశం జిల్లా అట. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నాడు.

ఎన్నో వందల మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ ని ఆడిషన్స్ చేసిన తర్వాత తనని ప్రశాంత్ నీల్ సెలెక్ట్ చేసుకున్నాడని, నెల రోజుల పాటు రిహార్సల్స్ చేయించి, 15 రోజుల్లో నాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేసాడని చెప్పుకొచ్చాడు కార్తికేయ. అంతే కాదు ప్రముఖ హీరో రవితేజ కజిన్ బ్రదర్ కి కార్తికేయ కొడుకు అట. అంటే రవితేజ కి కూడా కొడుకు వరుస అవుతాడట కార్తికేయ. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
