ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?, ఇతను బాలనటుడిగా రజినీకాంత్, కమల్ హాసన్ , చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఇలా ఎంతో మంది లెజెండ్స్ సినిమాల్లో నటించాడు. అలా బాల్యంలోనే సుమారుగా 200 చిత్రాల్లో బాలనటుడిగా నటించి స్టార్ కిడ్ గా ఎదిగాడు. పెద్దయ్యాక ఇతను పెద్ద నటుడు అవుతాడని అందరూ అనుకున్నారు కానీ, అనూహ్యంగా ఆయన స్క్రిప్ట్ రైటింగ్ నేర్చోని కథకుడిగా మారాడు.
పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. కానీ ఆయన ఎంచుకున్న మార్గం సరైనది కాకపోవడం తో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అనుకున్నంత రేంజ్ కి వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత ఆయన కొన్ని రోజులకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారం లోనే ఆయన వెనుతిరిగాడు. అతను మరెవరో కాదు సూర్య కిరణ్.
ఇతను డైరెక్టర్ గా మారిన తర్వాత అక్కినేని నాగార్జున నిర్మాతగా మారి, సుమంత్ తో ‘సత్యం’ అనే సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు సూర్య కిరణ్ ని పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఆయన కెరీర్ లో అదే చివరి హిట్ గా నిల్చింది. అలాగే ఈయన ప్రముఖ స్టార్ హీరోయిన్ కళ్యాణి ని ప్రేమించి పెళ్లాడాడు.
కొంత కాలం దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ,కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతని గురించి ఎవరికీ తెలియని మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ప్రముఖ సీరియల్ హీరోయిన్ సుజిత కి ఇతగాడు సోదరుడు కూడా. సుజిత కూడా చిన్నతనం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం లో బాలనటిగా మగవాడి పాత్రలో కనిపించింది.