MalaikaArora : మొగుడిని వదిలేసి 50 ఏళ్ల వయస్సులో ప్రియుడితో రెండో బిడ్డను కన్న స్టార్ హీరోయిన్

- Advertisement -

MalaikaArora : షారూఖ్ ఖాన్ హీరోగా దిల్ సే సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు చేరువైంది ముద్దుగమ్మ మలైకా అరోరా. ఆ తర్వాత గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అనే పాటతో తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. అయితే సినీ నటిగా కాకుండా వివాదాలతోనే ఆమె ఫ్యాన్స్ కు చేరువైంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్టు ఓ రూమర్ వైరల్ అవుతోంది.

మలైకా అరోరా కెరీర్ పరంగా పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా వెళ్లింది. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. 1998లో పెళ్లి చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.. 2017 వరకు దాంపత్య జీవితం కొనసాగించింది. దాదాపు 20 ఏళ్లు వైవాహిక జీవితం తర్వాత వారిద్దరూ డివోర్స్ తీసుకున్నారు.

- Advertisement -

అయితే డివోర్స్ తర్వాత కూడా సల్మాన్ ఖాన్ కుటుంబంతోను అలాగే అర్బాజ్‌ ఖాన్‌తోను ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగిస్తోంది. అర్భాజ్ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు మలైకా తన కొడుకుతో హాజరవుతుంది. అయితే అర్బాజ్‌తో విడాకుల తర్వాత 2016 నుంచి బాలీవుడ్ హీరో, బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది. అర్జున్ తనకంటే 12 ఏళ్లు చిన్నవాడు. పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలు షేర్ చేస్తుంది. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలో మలైకా అరోరా 50 ఏళ్ల వయస్సులో తల్లి అయిందంటూ ఓ పోస్ట్ నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. సినీ క్రిటిక్ ఉమైర్ సందు ఆమె ఫొటో షేర్ చేసి మరీ.. మలైకా అరోరా తన లవర్ అర్జున్ కపూర్ స్పెర్మ్ తో సరోగసీ ద్వారా రెండో బిడ్డకు తల్లి అయింది’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here