Mani Sharma : టాలీవుడ్ స్టార్ హీరోలకు అద్భుతమైన పాటలను అందించి వారి సినిమాల సక్సెస్ లలో కీలక పాత్ర పోషించిన.. మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న మణిశర్మ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మహేష్, పవన్ కల్యాణ్‌లకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరుకున్న సంగతి తెలిసిందే.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/0d887b6b-7bf5-4e2d-98e4-e24d5b89cc4e-jpg.webp)
సమర నరసింహ రెడ్డి, ఆది లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మూవీ సక్సెస్ రేటును పదింతలు చేసిన ఘనత మణిశర్మ కే సొంతం. ఇక మన టాలీవుడ్ లో కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల రాకతో మణిశర్మని అందరూ మర్చిపోయారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు పూరీ జగన్నాథ్.. మణిశర్మ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. రామ్ పోతినేని హీరోగా కొత్త చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరీ- -మణిశర్మ కాంబోలో వచ్చి హిట్ కొట్టిన ఇస్మార్టుకు సీక్వెల్. ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రీసెంట్ గా పూరీ, మణిశర్మ మ్యూజిక్ ఆల్బమ్ ను తయారు చేస్తూ ఓ పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/a023edb3-c163-485d-8717-01542426a5f5-1024x576.webp)
పోస్టులో.. మ్యూజిక్ సిట్టింగ్‌లు ఫుల్ స్వింగులో ఉన్నాయి. కొన్ని అద్భుతమైన ట్రాక్‌లు లాక్ చేయబడ్డాయి. అవి రామ్ ఎనర్జీకు తోడై పూనకాలు తెప్పిస్తాయి. మణిశర్మ మామూలుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని పూరీ కితాబిచ్చారు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్నితెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. మార్చి 8న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ విడుదల కానుంది.