Renu Desai బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు అనివార్య కారణాలతో విడిపోయారు. దీంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై తన పిల్లల ఆలనపాలన చూసుకుంటూ ఉంది. ఎంతోమంది దర్శకనిర్మాతలు తమ చిత్రాల్లో నటించాలంటూ ఆఫర్ చేసిన సున్నితంగా రిజెక్ట్ చేసింది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత రవితేజ సినిమా టైగర్ నాగేశ్వర రావుతో వెండి తెరకు రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారు రేణు దేశాయ్. ఆ సమయంలోనే తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను పుట్టడమే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరెంట్స్ ఆశగా కొడుకు కోసం ఎదురు చూడగా తను పుట్టానని.. అందుకే తనంటే పేరెంట్స్ కు ఇష్టం లేదని తెలిపింది. చాలామంది తల్లిదండ్రులు కొడుకు పుట్టలేదని.. పుట్టిన ఆడపిల్లలను చంపేస్తుంటారని.. నా పేరెంట్స్ అలా చేయకపోవడం కొంత సంతోషమని తెలియజేసింది. తనను చిన్ననాటి నుంచి ఇంట్లో పని వాళ్ళ పెంపకంలోనే పెరిగానంటూ ఎమోషనల్ అయింది.

ఎంతో ఆశతో పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కూడా జీవితం ఇబ్బందికరంగానే మారిందన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్న అక్కడ ఆమెకు ఎదురైంది. అందుకు సమాధానంగా…. వాస్తవానికి తనకు పెళ్లి అన్న కాన్సెప్ట్ చాలా ఇష్టమని అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. తాను మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరుపుకుని పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చింది. తన లాంటి పరిస్థితి తన పిల్లలకు కూడా రాకూడదన్న ఉద్దేశంతోనే తాను నిశ్చితార్థం జరుపుకున్నప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదని.. మరో రెండు మూడేళ్లలో తన పిల్లలు సెటిల్ అవుతారని.. అప్పుడు తప్పకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని తెలిపింది.