Chiranjeevi : చిత్ర పరిశ్రమలో ఓ హీరో రికార్డులను మరో హీరో బద్దలు కొట్టడం కామన్. ఇది మనం తరచూ చూస్తూనే ఉంటాం. అలా రికార్డును బద్దలు కొడితేనే .. కదా మరొక హీరో క్రేజీ రికార్డును నెలకొల్పుతాడు. మరొక హీరో ఆ రికార్డును బద్దలు కొడతాడు. ఇది ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమే. అయితే ఇక్కడ మాత్రం మెగా అభిమానులకు పిచ్చెక్కించే రికార్డు నమోదు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఎలా అంటే తన సొంత కొడుకు రికార్డ్ ని బద్దలు కొట్టేశాడు. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికి ఇండస్ట్రీలో ఆయన నటించిన సినిమాలు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆయన పై భారీగా ట్రోలింగ్ జరిగింది. పలువురు బూతులతో ఆయన ను ట్రోల్ చేశారు . ఎన్ని చేసినా అలాంటివి పెద్దగా పట్టించుకోని చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన తన భార్య సురేఖతో అమెరికా వెళ్లారు. అక్కడే ‘బ్రో’ డైరెక్టర్ టీజీ విశ్వప్రసాద్ ని కలిశారు. అయితే ఆయన వెంటనే రూ.100 కోట్ల చెక్ ను చిరంజీవి చేతిలో పెట్టారట.

“మీరు ఎలాగైనా సరే ఈ సినిమాని ఫైనలైజ్ చేయాలంటూ మొండి పట్టుదల పట్టారట”. కానీ చిరంజీవి ఆ చెక్కును తాకను కూడా తాకలేదట. ముందు విశ్వంభర సినిమా షూట్ కంప్లీట్ అవ్వనీయండి తర్వాత చూద్దామంటూ తెగేసి చెప్పాడట. యంగ్ హీరోస్ కి.. పాన్ ఇండియా హీరోస్ కి రూ.100 కోట్లు ఆఫర్ ఎవరైనా ఇస్తారు. సీనియర్ హీరోకి రూ.100 కోట్ల ఆఫర్ ఇవ్వాలంటే మాత్రం నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని చిరంజీవి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిర్మాతలకు కలిగిస్తున్నాడు. అఫ్ కోర్స్ గతంలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కి సైతం ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. అయితే యంగ్ హీరోకి ఎవరైనా ఆఫర్లు ఇస్తారు.. కానీ, సీనియర్ హీరోకి ఆఫర్ ఇవ్వడమే గొప్ప అంటున్నారు మెగా ఫ్యాన్స్. అలా తన కొడుకు రికార్డును బద్దలు కొట్టి సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు చిరంజీవి.