Archana : సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. అదంతా ఓ మామాలోకం. ఊసరవెల్లి ఎలా రంగులు మారుస్తుందో.. అక్కడ జనాలు కూడా అంతే వేగంగా రంగులు మార్చుతుంటారు. ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు ఇదే మాట చెప్పుకొస్తూ ఉంటారు. మరి కొంతమంది అలాంటి మాయలకు బలైపోయిన సంఘటనలు కోకొల్లలు. అలా బలైపోయి బయటికి వచ్చి ఓపెన్ గా పలు ఇంటర్వ్యూలలో మేము ఫలానా వాళ్ల చేత మోసపోయామంటూ చెప్పుకొస్తుంటారు. అలా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిన హీరోయిన్ అర్చన కూడా హీరోయిన్ గా తన కెరీర్ ను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. చక్కగా ఉంటుంది అందంగా మాట్లాడుతుంది.. తెలుగు అవలీలగా పలికేస్తుంది.. డాన్స్, నటన, ఎక్స్ప్రెషన్స్..అఫ్ కోర్స్ హీరోయిన్ కి మించిన మెటీరియల్ అర్చన సొంతం. అయినా ఆమె ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోలేకపోయింది.

చూడగానే ఆకట్టుకునేలా కుందనపు బొమ్మలా ఉంటుంది. మేకప్ వేయకపోయినా అట్రాక్టివ్ గా ఉంటుంది. మరి అలాంటి అర్చన ఇండస్ట్రీలో ఎందుకు హీరోయిన్ గా సెటిల్ కాలేక పోయిందనేది ప్రశ్నార్థకమే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన మాట్లాడుతూ తన కెరియర్ డౌన్ అవ్వడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ త్రిష. పరోక్షంగా అర్చన కెరియర్ డౌన్ అవ్వడానికి హీరోయిన్ త్రిషనే కారణం అంటూ పలువురు జనాలు కూడా అప్పట్లో మాట్లాడుకోవడం తెలిసిందే.

ప్రభుదేవా దర్శకత్వం వహించిన “నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ” సినిమాలో నిజానికి అర్చనది సెకండ్ హీరోయిన్ పాత్ర. కానీ ఫైనల్లీ ఆమెది ఫ్రెండ్ పాత్రగా మలి చేశారు మేకర్స్. ఆ సినిమాలో త్రిష కన్నా అర్చన చాలా చక్కగా నటించిందని చాలామంది జనాలు కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని కొన్ని మంచి సీన్స్ అర్చనవి లేపేసారట. ఆ కారణంగానే అర్చనది సపోర్టింగ్ పాత్రగా మిగిలిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అర్చనను సపోర్టింగ్ రోల్స్ కోసమే అప్రోచ్ అయ్యే వారట. హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు కరువయ్యాయట. వచ్చిన అరా కొరా కూడా ఆమెకు హిట్ ఇవ్వలేకపోయాయి. ఇలా పరోక్షకంగా అర్చన కెరియర్ నాశనం అవ్వడానికి కారణమైంది త్రిష అంటూ పలువురు అర్చన అభిమానులు అప్పట్లో మాట్లాడుకునే వాళ్ళు .