Thangalaan Review : ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యాలంటే నిన్నటి తరం లో కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా. కానీ నేటి తరం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ప్రయోగాత్మక చిత్రాలంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది చియాన్ విక్రమ్. స్టార్ స్టేటస్ ని పక్కన పెట్టి, ప్రేక్షకులకు ఎదో ఒక కొత్త అనుభూతి తన నటన ద్వారా కలగాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు. ఆ క్రమం లో ఆయనకీ ఎక్కువగా ఫ్లాప్స్ వచ్చాయి. అయినా కూడా వెనకడుగు వెయ్యలేదు. ఇప్పటికీ అదే తరహా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రీసెంట్ గా ఆయన పీఏ రంజిత్ దర్శకత్వం లో ‘తంగలాన్’ అనే చిత్రం చేసాడు. నేడు ప్రరపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుండా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడండి.
కథ:
ఈ కథ బ్రిటీష్ కాలం నాటికి చెందినది. ఆ కాలం లో ఒక తెగకు నాయకుడైన తంగలాన్(విక్రమ్), బ్రిటీష్ జనరల్ కోరిక మేరకు సమీపం లో ఉన్న బంగారు గని తవ్వి తీసేందుకు ఒప్పుకుంటాడు. ఆ గని ఉన్న ప్రాంతానికి ఆరతి అనే మంత్రగత్తె కాపలాగా ఉంటుంది. బంగారు గని తవ్వడానికి ఎవ్వరు ప్రయత్నం చేసిన ఆ మంత్రగత్తె తన మంత్రశక్తితో మట్టికరిపిస్తుంది. మరి తంగలాన్ ఈ మంత్రగత్తె ని దాటుకొని ఆ గని ని ఎలా సాధించాడు. ఆమె ఆటలను ఎలా అరికట్టాడు?, బంగారు గని ని తవ్వి బ్రిటీష్ జనరల్ కి అందించాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
ఈ సినిమాలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది విక్రమ్ గురించి. ఆయన నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పేదేముంది. పాత్ర కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే నటుడు ఆయన. ఈ సినిమాలో కూడా తన పాత్ర కోసం అదే చేసాడు. నటించాడు అని అనడం కంటే జీవించాడు అనే చెప్పాలి. కానీ డైరెక్టర్ పీఏ రంజిత్ టేకింగ్ స్టైల్ మన అందరికీ తెలిసిందే. చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి థ్రిల్లింగ్ అంశాలను జోడించకుండా, సూటిగా స్లో న్యారేషన్ తో చెప్తుంటాడు.
ఈ సినిమాకి కూడా అదే చేసాడు. మొదటి 40 నిమిషాల్లోనే మన అందరికీ కథ అర్థం అయిపోతుంది. ఆ తర్వాత ఏమి జరగబోతుంది అనేది కూడా తెలుస్తుంది. కానీ ప్రేక్షకులను ఒక సరికొత్త లోకానికి తీసుకొచ్చి, వాళ్ళని ఆసక్తికరంగా థియేటర్ లో కూర్చొని చూసేలా గా చెయ్యడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యింది.
ఇక ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన మాళవిక మోహనన్, ఇందులో మంత్రగత్తె పాత్రలో తన విలనిజం తో ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఇందులో ఆమె హీరో విక్రమ్ తో సమానంగా పోరాట సన్నివేశాల్లో కూడా అద్భుతంగా రాణించింది. ఇక విక్రమ్ కి జోడిగా నటించిన మలయాళం నటి పార్వతి కూడా తన పరిధిమేర చక్కగా చేసింది. ఇక తమిళ నటుడు పశుపతి పాత్ర ఈ సినిమాకి మరో ప్రధానమైన హైలైట్. జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేక సన్నివేశాలకు ఊపిరి పోసింది. ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఈ చిత్రం కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నటీనటులు : చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి, పశుపతి తదితరులు.
రచన – దర్శకత్వం : పీఏ రంజిత్.
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
చివరిమాట :
ఓవరాల్ గా భారీ అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాని చూస్తే కచ్చితంగా నచ్చుతుంది. హీరో విక్రమ్ నటన కోసం ఒక్కసారి థియేటర్ కి వెళ్లి చూడొచ్చు
రేటింగ్ : 2.75/5