Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో రజినీ కాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ దక్కించుకున్న హీరో విజయ్ మాత్రమే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం కోసం విజయ్ చాలా కాలం తర్వాత ఒక సరికొత్త మేకోవర్‌ని కూడా ట్రై చేశారు. సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన కనిపించబోతున్నారు. ఇందుకోసం మీసాలు, గడ్డాలు తీసి యంగ్ లుక్‌లో కనిపించారు. అయితే తాజాగా విజయ్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయనకు గాయమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
హీరో విజయ్ తన గత హిట్ మూవీ గిల్లిని రీసెంట్ గా రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడంతో.. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, డైరెక్టర్ ధరణి.. ఆయనను కలిసి విషెష్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్లో విజయ్ చేతికి గాయమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ‘ది గోట్’ సినిమా షూటింగ్ ఇటీవల రష్యాలో జరిగింది. అక్కడే హీరో విజయ్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇక ‘ది గోట్’ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ఏడాది సెప్టెంబర్ 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్, అజ్మల్ అమీర్ తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ సురేష్, కల్పాతి ఎస్ గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Meendum Solli Adicha Velu ❤️🔥#Thalapathy @actorvijay sir was greeted by Producer @AMRathnamOfl, Director #Dharani, and Distributor @sakthivelan_b and congratulated him on the grand success of #GhilliReRelease ❤️#ThalapathyVijay sir #Ghilli pic.twitter.com/BEgFCi63pG
— TheRoute (@TheRoute) April 24, 2024