Dil Raju అలాంటి కామెంట్స్ చేసిన టాప్ నిర్మాత.. రచ్చరచ్చ చేస్తున్నారుగా

- Advertisement -

Dil Raju : సాధారణ ఎన్నికలను త‌ల‌పించేలా జరిగినా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 48 ఓట్లకు గాను 31 ఓట్లతో దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఫలితాలు రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇంత హ‌డావిడి ఎందుక‌ని సినిమా పెద్ద‌లు కూడా చ‌ర్చించుకున్నారు.. ఎట్టకేలకు ఆదివారం చాంబర్ ఎన్నికల ఫలితాలు వెలుపడ్డాయి. అధ్యక్షుడిగా దిల్ రాజు ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై దిల్ రాజు ప్యానెల్ ఆపోజిట్ ప్యానల్ అయినటువంటి సి కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికకు సంబంధించి నాలుగు సెక్టార్లుగా ఎన్నికలు జరిగాయి. ప్రొడ్యూసర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టర్.

Dil Raju
Dil Raju

మొదటగా ఎగ్జిబిటర్ సెక్టర్ కి సంబంధించి 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రొడ్యూసర్, సెక్టర్ స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు జరిగిన మూడు సెక్టార్లకు సంబంధించి ఓటర్లంతా కూడా కరెక్ట్ గా ఓట్లు వేశారని ఫలితాల తర్వాత సి కళ్యాణ్ మీడియాకు వివరించారు. కానీ ఎగ్జిబిటర్లు అమ్ముడుపోయారంటూ ఎన్నికల ఫలితాలను కామెంట్ చేశారు. కానీ చివరగా ఎవరు గెలిచినా ఫిలిం ఛాంబర్, సినిమా అభివృద్ధికి కలిసి పని చేస్తామని.. దిల్ రాజుకు సపోర్ట్ చేస్తామని మీడియాతో మాట్లాడారు సి కళ్యాణ్.

ఎన్నికలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు దేనికి పోటీపడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోషపడాలో.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం లేదని అన్నారు. తాను కూడా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని, చాలా ఎన్నికలను చూశానని పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తోందని అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com