అప్పుడెప్పుడో శివాజీ సరసన ఆలయం అనే సినిమాలో నటించింది మలయాళ కుట్టి హనీ రోజ్. ఆ సినిమా అసలు ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. ఆ సినిమాలో నటించిన హనీరోజ్ ను దాదాపు తెలుగు ఇండస్ట్రీ మరచిపోయింది. ఆలయం సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో మాతృభాషలోనే వచ్చిన సినిమా చేసుకుంటూ కెరీర్ సో.. సో.. గా కొనసాగిస్తోంది. మళ్లీ ఇన్నాళ్లకు బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి నేనున్నానంటూ గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమాలో అమ్మడి అందానికి జనాలు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా హనీ రోజ్ పేరు మార్మోగిపోతుంది.
మాలీవుడ్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హనీ రోజ్. పలు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. వీరసింహారెడ్డి అనే సినిమాతో తెలుగులో కూడా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య సరసన మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేసింది. అయితే ఈ సినిమాలో హనీ రోజ్ ని ఎంపిక చేయడానికి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఆమెను రెండు సార్లు ఆడిషన్ చేశాడట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఫస్ట్ టైం ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ కొత్త అందం అయితే బాగుంటుందని భావించారట చిత్ర బృందం.
ఈ క్రమంలోనే హనీ రోజ్ ను ఫైనలైజ్ చేసుకున్నాడట గోపీచంద్. అప్పుడు ఆమె ఇచ్చిన ఆడిషన్ ఓకే అనిపించిందట. కానీ బాలయ్య లాంటి అగ్రహీరో సరసన నటించాలంటే చాలా ఫర్ ఫెక్ట్ గా ఉండాలని అనుకుని గోపీచంద్ ఆ తర్వాత మరోసారి తనలోని మాస్ యాంగిల్ కోసం ఆడిషన్స్ చేశాడట. ఈ సారి హనీరోజ్ ను తనలోని మాస్ యాంగిల్ ను బయటపెట్టమని కోరాడట. ఆమె నాకు మాస్ పాత్రలంటే ఇష్టం లేదు.. క్లాస్ లుక్స్ నచ్చుతుందని చెప్పిన గోపీచంద్ వినకుండా ఆ యాంగిల్ ఆమెతో చేయించాడట. దాని కారణంగానే బాలయ్య -హనీ రోజ్ మధ్య కొన్ని నాటీ సీన్స్ తెరెక్కించినప్పుడు ఫర్ ఫెక్ట్ గా వచ్చాయట. దీంతో గోపీచంద్ మలినేని మహా రసికుడే అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.