Surekha Vani : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అక్క, అత్త, వదిన, పిన్ని, తల్లి ఇలా పలు క్యారెక్టర్లలో కనిపించి హీరోయిన్లకు మించి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసి ఫుల్ పాపులారిటీతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే సురేఖా వాణి గత కొద్ది కాలంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. కానీ ఇటీవల తన కూతురు సుప్రీతను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ అమర్ దీప్ సరసన ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
అయితే సురేఖా వాణి మాత్రం కూతురు బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలు షేర్ చేసి కూతురిని మించిన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సురేఖావాణికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ తింటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న పార్టీకి వెళ్లిన ఫొటో నెట్టింట్లో పెట్టడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ పార్టీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫ్రెండ్ ఒర్రీతో అత్యంత సన్నిహితంగా ఓ ఫొటో దిగింది.

పింక్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలు చూపిస్తూ ఒర్రీని పట్టుకుని సురేఖ నవ్వుతూ పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో టాలీవుడ్ యాక్టర్ సురేఖా వాణి ఫొటోపైనే అందరి దృష్టి పడింది. దానికి కారణం.. ఈ పార్టీలో అందరూ బాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. టాలీవుడ్‌కు చెందిన వారు సురేఖా వాణి తప్ప మరెవరూ లేరు. దీంతో ఈ పిక్ చూసిన వారంతా ఆమెకు.. అక్కడేం పని అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 46 ఏళ్ల వయసులో సురేఖావాణి ఇలా భగింమలు ఇచ్చి షాకిచ్చిందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోందో లేక కూతురికి అవకాశాల కోసం ట్రై చేస్తుందో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram