KCR Movie : ‘KCR’ సినిమా పాట ఆవిష్కరణ.. చాలా బాగుందని మెచ్చుకున్న కేసీఆర్

- Advertisement -

KCR Movie : జబర్దస్త్‌ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ప్రస్తుతం వారు వెండితెర పై రాణిస్తున్నారు. హీరోలుగా, కమెడియన్లుగా, దర్శకులుగా, ఆర్టిస్టులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలో రాకింగ్ రాకేష్ ఒకరు. ప్రస్తుతం రాకింగ్‌ రాకేష్ హీరోగా తెరకెక్కిన KCR ( కేశవ చంద్ర రమావత్‌ ) సినిమాలోని తెలంగాణ తేజం పాటను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో సినిమా హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేష్ శుక్రవారం ఆయనను కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేత మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేస్తున్నట్లుగా నిర్మాత రాకేష్ తెలిపారు.

ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయిందని తెలిపారు. అయితే కేసీఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉందా.. లేదంటే ఆయన జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. రాకింగ్‌ రాకేశ్‌తోపాటు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత, సింగర్లు విహ, గీత, రచయిత సంజయ్‌ మహేశ్‌లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు తేజం పాటను కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దామోదర్‌రావు, బీఆర్‌ఎస్‌ నేతలు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, సంతోశ్‌ కుమార్, మధుసుధనచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

 

ఈ చిత్రంలో రాకేష్ సరసన అనన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటులు తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, ధనరాజ్, తాగుబోతు రమేష్, రచ్చరవి, జోర్ధార్ సుజాత, తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా గరుడవేగ అంజి పని చేస్తున్నారు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో.. విభూది క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here