Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు.. ఆయన సినిమాలు మాత్రమే కాదు.. చిరు చేసే సమాజసేవలు కూడా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.. సాయం కోరినవాడికి సాయం చెయ్యడమే కాదు.. పది మంది చెయ్యాలని సోషల్ మీడియాలో ద్వారా విజ్ఞప్తి చేస్తాడు.. ఆయన మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది.. ఏమి చెప్పినా చిరుకు మెగా అభిమానులతో పాటుగా సినీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.. తాజాగా చిరంజీవి చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యింది.. ఆ వీడియో పై స్పందించిన సీఎం ఆయన పై ప్రశంసలు కురిపించారు..
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ ను ఇవ్వడానికి ముందుకు రావాలి.. ప్రాణాలను కాపాడటం మనిషిగా మన బాధ్యత అని వీడియో ద్వారా తెలిపారు.. ఆ వీడియోకు ఎంత మంచి స్పందన వచ్చిందో మనం చూసాము.. ఇక నిన్న డ్రగ్స్ అనేది ఒక భూతం.. దాన్ని నిర్మూలించాలి అంటూ ఒక సందేశాత్మక వీడియోను చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. దాన్ని చూసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ చిరు ప్రయత్నం బాగుందని అభినందించారు..
అంతేకాదు సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు, నిర్మాతలు ఇలాంటి వాటిని చెయ్యడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. అలాగే సినిమా టిక్కెట్ల కోసం లేదా లొకేషన్ పర్మిషన్ల కోసం తమ వద్దకు వచ్చే సినీ సభ్యులు ఇలా డ్రగ్స్ నిర్మూలన పై రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియోను సినీ హీరోలు, నటుల చేత చేయించాలని కండిషన్ పెట్టాడు.. ఆ కండిషన్ కు ఒప్పుకుంటే ప్రభుత్వం సహకారం అందుతుందని తేల్చి చెప్పాడు.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మరి దీనిపై నిర్మాతల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..