Big Boss : బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా గడిచిన సంగతి అందరికీ తెలిసిందే. సీజన్ మొత్తం లో బెస్ట్ ఎపిసోడ్స్ మొత్తం ఈ వారమే వచ్చాయి. ఈరోజు అమర్ దీప్ సతీమణి తేజస్విని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం, వాళ్ళిద్దరి మధ్య కాలసేపు జరిగిన ఎమోషనల్ బాండింగ్, ఇదంతా షో కి హైలైట్ గా నిల్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రియాంక జైన్ మరియు తేజస్విని బయట మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి తెలిసిన విషయమే.
కానీ నేడు ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన క్షణం నుండి తిరిగి వెళ్లెవరకూ, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో చక్కగా మాట్లాడింది కానీ, ప్రియాంక ని మాత్రం కనీసం అసలు పట్టించుకోలేదు. ఎవరో అన్నట్టుగా ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతే కాదు అమర్ దీప్ కి ప్రత్యేకంగా లోపలకు తీసుకొని వెళ్లి ఇలాగే సొంతంగా ఆడు, ఎవరి కోసం స్టాండ్ తీసుకోకు, పేరు చెప్పను కానీ మొన్న నువ్వు ఒకరి కోసం స్టాండ్ తీసుకొని అంతలా ఫైట్ చేసావు, నువ్వు హైలైట్ అయ్యి దోషి గా నిలబడ్డావు కానీ, ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నావో వాళ్ళు మాత్రం పక్కకి జరిగిపోయారు అంటూ ప్రియాంక ని ఉద్దేశించి అమర్ దీప్ కి వార్నింగ్ ఇచ్చింది.
కనీసం కేక్ తినిపిస్తున్నప్పుడు కూడా ప్రియాంక ని తేజు అసలు పట్టించుకోలేదు. దీనికి ప్రియాంక కూడు బాగా హర్ట్ అయ్యింది. నా మీద తేజు కి ఎందుకు అంత కోపం?, నేనేం చేశాను?, హౌస్ లోకి వచ్చినప్పటి నుండి నాతో చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యింది. కనీసం ముఖం వైపు కూడా చూడడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అమర్ దీప్ అందుకు తేజు తరుపున క్షమాపణలు చెప్పడం గమనార్హం.అయితే తేజస్విని ప్రియాంక ని అలా దూరం పెట్టడానికి కారణం ప్రియాంక కాబొయ్యే భర్త మొన్న హౌస్ లోకి వచ్చి అమర్ దీప్ తో దూరం గా ఉండు అని పరోక్షంగా హింట్ అవ్వడమే అని తెలుస్తుంది. ఆమె కోసం స్టాండ్ తీసుకొని నువ్వు అంత ఫైట్ చేస్తే వాళ్ళు నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని పరోక్షంగా అమర్ దీప్ కి హింట్ ఇచ్చింది.
Something is fishy 🥴
— Mangalam Mawa (@Mang_Mawa) November 9, 2023
Teju gurinchi edo complaint isthundi amar gadiki, vaademo sorry chepthunnadu orey em jarugutundi raa😂😂😂
Priyanka ki teju nachaleda? 🤔#BiggBossTelugu7 pic.twitter.com/obeZjiHcpw